ByGanesh
Wed 18th Oct 2023 01:17 PM
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బ్రేక్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాడు. భార్య ఉపాసన కుమర్తె క్లింకారా తో కలిసి చరణ్ వెకేషన్స్ కి వెళ్లిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కూతురు క్లింకారా పుట్టాక రెండు నెలలకి భార్య ఉపాసనతో కలిసి సింగిల్ గా చిన్నపాటి ట్రిప్ కి వెళ్లిన రామ్ చరణ్ ఈసారి దసరా వెకేషన్ ని మాత్రం మొదటిసారి కూతురుతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు.
ఉపాసన క్లింకారా ని ఎత్తుకుని తన కూతురు ఫేస్ కనిపించకుండా కవర్ చేసేసింది. ఇక రామ్ చరణ్ ఎప్పటిలాగే తన పెట్ డాగ్ రైమ్ తో కలిసి కనిపించాడు. ఇక చరణ్ వెకేషన్ కి వెళ్లాడా లేదంటే వరుణ్ తేజ్ వెడ్డింగ్ కోసం ఇటలీ వెళ్ళాడా అనే కన్ఫ్యూజన్ లో మెగా అభిమానులు ఉన్నారు. అయితే వరుణ్ తేజ్ పెళ్ళికి సమయం ఉండడంతో రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి ఈ దసరా వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది.
కుమార్తె క్లింకారా తో మొదటి వెకేషన్ ని చరణ్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకుని భార్య కూతురితో టైమ్ స్పెండ్ చెయ్యబోతున్నాడు. ఇక అక్కడి నుంచి రాగానే వరుణ్ తేజ్ పెళ్లి పనుల్లో చరణ్ నిమగ్నమవుతాడని తెలుస్తోంది.
Ram Charan clicked with his wife and daughter:
Ram Charan heads to Italy along with his family