ByGanesh
Tue 26th Mar 2024 08:49 PM
రామ్ చరణ్ పుట్టిన రోజు రేపు (మార్చ్ ౨౭). రామ్ చరణ్ బర్త్ డే కి స్పెషల్ ట్రీట్స్ కింద మెగా ఫాన్స్ కి చాలా సర్ ప్రైజ్ లు అందబోతున్నాయి. ఆయన నటిస్తున్న ప్యాన్ ఇండియా ఫిలిం గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి రాబోతుంది. అలాగే గేమ్ ఛేంజర్ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ కూడా రాబోతుంది అనే టాక్ ఉంది. మరోపక్క బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే RC16 నుంచి కూడా చరణ్ బర్త్ డే స్పెషల్ ట్రీట్ ఉండబోతుంది అని తెలుస్తోంది.
ఇక సుకుమార్ తో RC17 అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. మరి ఇవన్నీ ఓకె.. రామ్ చరణ్ ఏం చేస్తాడు, తన బర్త్ డే ని ఎలా ప్లాన్ చేసుకున్నాడు. గత ఏడాది అయితే బోలెడంతమంది సెలబ్రిటీస్ ని పిలిచి తన బర్త్ డే కి గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన రామ్ చరణ్ ఈ ఏడాది ఎలా తన బర్త్ డే ని ఎలా ప్లాన్ చేసుకున్నారో అనే ఆతృతలో చాలామంది కనిపిస్తున్నారు.
అయితే రామ్ చరణ్ మాత్రం తన బర్త్ డే రోజున ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం తిరుమలకి బయలుదేరి వెళ్లారు. భార్య ఉపాసన, కుమార్తె క్లింకారతో సహా రామ్ చరణ్ బేగం పేట ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో తిరుపతికి బయలుదేరి వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రేపు గురువారం ఉదయం VIP బ్రేక్ దర్శనంలో చరణ్ దంపతులు తమ పాపతో సహా శ్రీవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
Ram Charan-upasana to Tirupati:
Ram Charan went to tirupati with Upasana, Klin Kaara