Latest NewsTelangana

Rangareddy Is The Richest District In Telangana | Richest Districts: తెలంగాణలో రిచ్చెస్ట్ జిల్లాగా రంగారెడ్డి


Telangana Richest Districts: తెలంగాణలో అత్యంత ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి (RangaReddy) నిలిచింది. హైదరాబాద్ (Hyderabad)ను వెనక్కు నెట్టి మరీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మేరకు రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఓ నివేదిక విడుదల చేసింది. ‘తెలంగాణ ఎకానమీ 2023’ పేరుతో ఈ నివేదికను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్న జిల్లాగా రంగారెడ్డి నిలిచినట్లు తెలిపారు. పర్ క్యాపిట ఇన్ కమ్ అధారంగా.. రంగారెడ్డి ఈ స్థానం దక్కించుకోగా, హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో సంగారెడ్డి (Sangareddy), మేడ్చల్ మల్కాజిగిరి నాలుగో స్థానం, యాదాద్రి ఐదో స్థానం, ఆరో స్థానంలో నల్గొండ, ఏడో స్థానంలో మహబూబ్ నగర్, మెదక్ జిల్లా ఎనిమిదో స్థానంలో, భద్రాద్రి కొత్తగూడెం తొమ్మిదో స్థానంలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పదో స్థానంలో నిలిచినట్లు అధికారులు వివరించారు. 

అదే కారణమా.?

రంగారెడ్డి జిల్లా పర్ క్యాపిటా ఇన్ కమ్ రూ.8.15 లక్షలకు పైగా ఉండగా.. హైదరాబాద్ పర్ క్యాపిటా ఇన్ కమ్ రూ.4.03 లక్షలకు పైగా ఉంది. అలాగే, హైదరాబాద్ వాసుల కంటే రంగారెడ్డి జిల్లా వాసులో అధికంగా ఆదాయం ఆర్జిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. కాగా, ఐటీ హబ్ కారణంగానే రంగారెడ్డి రిచెస్ట్ జిల్లాగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. జోన్ల వారీగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని ఐటీ హబ్స్ రంగారెడ్డి జిల్లా వైపు తరలిపోతున్నట్లు చెబుతున్నారు. స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ) పరంగా కూడా, తెలంగాణలోని జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. జిల్లా తలసరి ఆదాయం ప్రతి వ్యక్తి జిల్లాలో ఏడాదికి ఆర్జించే సగటు ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ వివరాలు ఓసారి చూస్తే..

పర్ క్యాపిట ఇన్ కమ్ వివరాలు

  • రంగారెడ్డి – రూ.8,15,996
  • హైదరాబాద్ – రూ. 4,03,214 
  • సంగారెడ్డి – రూ. 3,08,166
  • మేడ్చల్-మల్కాజిగిరి – రూ. 2,58,040
  • యాదాద్రి భువనగిరి – రూ. 2,47,184
  • నల్గొండ – రూ. 2,42,103
  • మహబూబ్ నగర్ – రూ. 2,40,900
  • మెదక్ – రూ. 2,32,384
  • భద్రాద్రి కొత్తగూడెం – రూ. 2,28,582
  • జయశంకర్ – రూ. 2,23,481 కోట్లుగా ఉంది.

తలసరి ఆదాయం ఆధారంగా టాప్ 10 ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. సిక్కిం మొదటి స్థానంలో ఉండగా.. గోవా రెండో స్థానంలో ఉంది.

Also Read: TS DSC: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌- ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ప్రకటించే భారీ నోటిఫికేషన్!



Source link

Related posts

చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

sheperd and 80 sheeps died due to train collision in sayampeta in hanmakonda | Hanmakonda News: ఘోర ప్రమాదం

Oknews

చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కనుంది? సీఎం మనసులో మాట ఇదేనా?

Oknews

Leave a Comment