ByGanesh
Mon 25th Mar 2024 04:16 PM
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తుంది. గ్లామర్ విషయంలో మడి కట్టుకుని కూర్చోకుండా అందాలు ఆరబోస్తూనే తన ప్రపంచం మొత్తం ఎంటర్టైన్మెంట్ అని చెప్పకనే చెబుతుంది. వెండితెర మీద అంతగా సక్సెస్ కానీ రష్మీ గౌతమ్.. బుల్లితెర మీద మాత్రం పాపులర్ ఫిగర్. ఎక్స్ట్రా జబర్దస్త్-శ్రీదేవి డ్రామా కంపెనీలకి యాంకరింగ్ చేసే రష్మీ గౌతమ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లో స్పెషల్ గా మెరిసిపోతుంది.
తాజాగా రష్మీ గౌతమ్ హాట్ పింక్ సారీ లో మెస్మరైజ్ చేసే ఫోజులతో ఉన్న ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సారీలోను తన అందాలను పదిలంగా ఆరబోసింది. వి నెక్ బ్లౌజ్ లో రష్మీ గౌతమ్ మెడలో సింపుల్ నెక్ లెస్ తో కనిపించింది. లూజ్ హెయిర్ తో పెద్ద బొట్టుతో డిఫరెంట్ లుక్ లో ఆరగొట్టేసింది. ఇది జబర్దస్త్ లుక్కా.. లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం వేసిన లుక్కా అంటూ ఆమె అభిమానులు ఆరాలు మొదలు పెట్టేసారు.
Rashmi looks beautiful:
Jabardasth anchor Rashmi latest saree look viral