EntertainmentLatest News

RC16 క‌థానాయిక‌.. స్టార్ హీరోయిన్ కుమార్తె!


మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే డెబ్బై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్‌ను ఫిబ్ర‌వ‌రి నాటి కంతా పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు ఉంటుంద‌నే దానిపై అప్పుడే న్యూస్ నెట్టింట చ‌క్క‌ర్లు కొట్ట‌టం ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే గేమ్ చేంజ‌ర్ ఆల‌స్యమ‌వుతూ వ‌చ్చింది కాబ‌ట్టి.. చ‌ర‌ణ్ నెక్ట్స్ సినిమాను ఆల‌స్యం చేయ‌కుండా సెట్స్  పైకి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నారు.

RC16 సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రో ఇప్ప‌టికే ఫిక్స్ అయ్యారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌వుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే హీరోయిన్ గురించి. సినీ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం మేర‌కు బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ కుమార్తె రాషా ట‌డానీ హైద‌రాబాద్‌కు వ‌చ్చి ఫొటో షూట్ పూర్తి చేసుకుని వెళ్లింది. రాషా హైద‌రాబాద్‌కు వ‌చ్చే క్ర‌మంలో ఎయిర్‌పోర్టులోని వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంకేముంది నెట్టింట స‌ద‌రు వీడియో తెగ వైర‌ల్ అయ్యింది.

రాషా ట‌డానీ లుక్ బావుంద‌ని ఆమె హీరోయిన్‌గా చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తే బావుంటుంద‌ని నెటిజ‌న్స్ స్పందించారు. RC16 పాన్ ఇండియా మూవీ. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్ సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో  డెబ్యూ హీరోయిన్‌ని తీసుకుంటారా? అలా తీసుకోవ‌టం మేక‌ర్స్‌కు ఓ రకంగా రిస్కే. అయినా కూడా ఆ రిస్క్ చేస్తారా? అని కూడా కొంద‌రు అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై ఎవ‌రెలా స్పందిస్తారో చూడాలి.



Source link

Related posts

Pawan Kalyan Selling His Properties In Hyderabad ఆస్తులమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్

Oknews

తెలంగాణ ఎన్నికలు.. నందమూరి హీరో ఏం చేస్తాడు?

Oknews

Misguided Samantha తప్పొప్పుకున్న సమంత

Oknews

Leave a Comment