GossipsLatest News

Reassurance for Ravi Teja Eagle buyers? ఈగల్ బయ్యర్లకు భరోసా?



Sat 24th Feb 2024 04:13 PM

ravi teja,eagle  ఈగల్ బయ్యర్లకు భరోసా?


Reassurance for Ravi Teja Eagle buyers? ఈగల్ బయ్యర్లకు భరోసా?

రవితేజ హీరోగా తెరకెక్కిన ఈగల్ చిత్రం సంక్రాంతి బరిలో ఫైట్ చెయ్యాల్సి ఉండగా.. కొంతమంది నచ్చజెప్పడంతో రవితేజ ఈగల్ చిత్రాన్ని సంక్రాంతి బరి నుంచి ఫిబ్రవరి 9 కి షిఫ్ట్ చేసుకున్నాడు. గత రెండు నెలలుగా ప్రమోషన్స్ చేస్తూ ఈగల్ పై అంచనాలు పెంచాడు. కానీ విడుదల సమయానికి ఈగల్ పై బజ్ క్రియేట్ అవ్వలేదు. అందులోను రవితేజ వరసగా డిసాస్టర్ తో ఉన్న హీరో. అయినప్పటికీ ఈగల్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. అయితే ఈగల్ చిత్రం మేకర్స్ అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్ తో టార్గెట్ రీచ్ అవ్వలేకపోయింది.

దానితో బయ్యర్లు ఈగల్ చిత్రంతో లాస్ అయ్యారు. కొంతమేర నష్టపోయారు. అయితే ఇప్పడు ఈ నష్టాలను రవితేజ నెక్స్ట్ చిత్రంతో ఆదుకుంటామని బయ్యర్లకు మిస్టర్ బచ్చన్ నిర్మాతలు భరోసా ఇచ్చారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈగల్ తర్వాత రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం హక్కులని ఈగల్ బయ్యర్లకి విక్రయించి ఈగల్ బయ్యర్లను ఆదుకోబోతున్నారన్నమాట. 


Reassurance for Ravi Teja Eagle buyers?:

Ravi Teja Eagle 









Source link

Related posts

విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల!

Oknews

Caste Census Of BCs Should Be Taken Up Immediately BRS MLC Kavitha

Oknews

వరుణ్ తేజ్-లావణ్యల కళ్ళు చెదిరే కాక్ టైల్ పార్టీ

Oknews

Leave a Comment