Telangana

Revanth Reddy: ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి, సహాయక చర్యలకు ఆదేశాలు



Revanth Reddy responds on Fire Accident at SB Organics:  హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంపై సమీక్ష చేయగా.. రియాక్టర్ పేలడంతో  మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి  మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు సూచించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

ఎస్బీ ఆర్గానిక్స్ లో అగ్ని ప్రమాదం సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎస్బీ పరిశ్రమలో మేనేజర్ గా చేస్తున్న రవి మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏడుగురు వ్యక్తులు చనిపోగా, మరో 10 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పక్కనున్న మరో పరిశ్రమకు వ్యాపిస్తున్నాయి. చుట్టుపక్కల వారిని సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని, మృతదేహాలను సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

TSRTC : తాగిన మత్తులో కండెక్టర్ ను కాలితో తన్నిన యువతి, సజ్జనార్ సీరియస్!

Oknews

An interesting discussion took place between KTR and Rajagopal Reddy in the assembly lobbies | Komatireddy Rajagopal Reddy : హోంమంత్రిని అవుతా

Oknews

Shock To BRS In Huzur Nagar, Municipal Chairperson Joins Congress

Oknews

Leave a Comment