Telangana

Revanth Reddy makes sensational comments on Kavitha in Narayanpet meeting | Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు



Telangana Congress: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీకి లొంగిపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని అన్నారు. నారాయణపేటలో కాంగ్రెస్‌ జనజాతర భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విమర్శలు చేశారు.
తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను ఆగస్టు 15లోపు మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేర్చేందుకు పోరాడుతామని అన్నారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందేనని అన్నారు. అందులో ఏ, బీ, సీ, డీ వర్గీకరణలు చేయాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు 10 శాతం మంది ఉంటే.. కేసీఆర్ కేవలం ఒక్కరికి మాత్రమే సీటు ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ముదిరాజ్ లను పట్టించుకోనందుకే ప్రజలు కేసీఆర్ ను వంద అడుగుల గోతి తీసి పాతాళంలో పాతి పెట్టారని వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్‌లో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తాము గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకేసారి మొత్తం రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. త్వరలోనే అర్హులైన వారిని ఇందిరమ్మ కమిటీల ద్వారా గుర్తించి.. లబ్ధిదారులకు అన్ని పథకాలు అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

పాలేరులో గెలుపు ప్రతిష్టాత్మకం-రంగంలోకి గులాబీ బాస్-paleru constituency brs takes prestigious cm kcr came into the arena ,తెలంగాణ న్యూస్

Oknews

Chief Minister Revanth Reddy congratulated Chiranjeevi on the occasion of Padma Vibhushan award

Oknews

Praja Palana Applications : ' వాటిని మరోసారి పరిశీలించండి' – ప్రజా పాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Oknews

Leave a Comment