Revanth Reddy Speech in Mahabub Nagar: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ధర్మంగా రావాల్సిన నిధులు రాకపోతే ఉతికి ఆరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడతానని స్పష్టం చేశారు. తాను మోదీపై చూపే మర్యాద మన రాష్ట్రానికి మంచి జరగడం కోసమేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి.. ప్రజలకు మంచిది కాదని రేవంత్ రెడ్డి చెప్పారు.
-రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభ నిర్వహించింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీకి తాను వినతి పత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారని.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానని అన్నారు.
కేటీఆర్, హరీశ్‌రావును చూస్తే.. బీఆర్ఎస్ ‘బిల్లా రంగా సమితి’ అనిపిస్తుంది. పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలోని మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతాను. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడి నుంచి వంశీచందర్ రెడ్డిని ఎంపీగా, జీవన్ రెడ్డిని పాలమూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించండి’’ అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
మరిన్ని చూడండి