CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిటింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఉన్నత న్యాయస్థానం చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మిషన్ భగీరథపైనా విచారణకు ఆదేశించామని సీఎం వెల్లడించారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తి అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఎక్స్ పైరీ అయిన మెడిసిన్ లాంటోడు !
కేసీఆర్.. ఎక్స్ పైరీ అయిన మెడిసిన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ”ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. గవర్నర్ ప్రసంగానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో ప్రతిపక్ష నేత ఏంటో అందరికీ తెలిసిపోతుంది. బీఏసీకి కూడా రాలేదంటే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. హరీశ్ రావును ఎలా అడ్డుకుంటాం. బీఆర్ఎస్.. కేసీఆర్, కడియం పేరు ఇచ్చారు. అనుమతి ఇవ్వాలో లేదో.. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. రేపు హిమాన్ష్ కూడా వస్తా అంటాడు. ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు.
బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా !
బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత నిర్వర్తించాలి. టీఎస్ పీఎస్ సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాలపై ప్రొసీజర్ తో ప్రభుత్వం ముందుకెళ్తోంది. కసబ్ కు ఉరి కూడా.. ప్రొసీజర్ తోనే జరిగింది. భవిష్యత్తులో నిరుద్యోగులు ఇబ్బందులు పడకూడదు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన తీర్మానం ఉంటుంది. అవసరం అనుకుంటే సభా సమావేశాలను స్పీకర్ పొడిగించవచ్చు. Krmb కి ప్రాజెక్ట్ లను గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పగించింది. సాగర్ ను ఏపీ సీఎం జగన్ పోలీసులతో ఆక్రమించినా.. కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని రేవంత్ ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్
ప్రతిరోజు 12 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకెళ్లినా కేసీఆర్ అడ్డుకోలేదు. బేసిన్ లు లేవు భేషజాలు లేవని కేసీఆర్ ఆయన కమిట్ మెంట్ కృష్ణా బేసిన్ లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు. సీఎంగా నేను కేసీఆర్ ను కూడా కలుస్తా. విజయసాయి రెడ్డి.. ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామన్నారు. విధానపరమైన లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నామని సీఎం తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు.
మరిన్ని చూడండి