Latest NewsTelangana

Revanth Reddy visited Kodangal constituency for the first time as CM | Revanth Reddy : సీఎం హోదాలో సొంత నియోజకవర్గానికి రేవంత్


Revanth Reddy visited Kodangal constituency :  సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించించారు.  సీఎం హోదాలో ఆయన తొలిసారి తన నియోజకవర్గానికి వెళ్లారు.  ఈ పర్యటనలో భాగంగా రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇందులో రూ.2,945 కోట్లతో కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని(Lift Irrigation Scheme) స్టార్ట్ చేయడం కూడా ఉంది. కొడంగల్ నియోజకర్గాన్ని వచ్చే ఐదేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేసేలా రేవంత్‌ ప్లాన్‌ చేస్తున్నారు. గత డిసెంబర్ 29న వికారాబాద్ కలెక్టర్ నేతృత్వంలో కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కాడా) ని ఏర్పాటు చేశారు. 
  
కొడంగల్ ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న  నారాయణపేట్ – కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. దీనికి రూ.2,945 కోట్లు ఖర్చుచేయనున్నారు.  రూ.6.8 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్ లో ఆర్ అండ్ బి అతిధి గృహం,  రూ.344.5 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్లు,వాటి విస్తరణ,పలు బ్రిడ్జిల నిర్మాణాలు,  రూ.27.886 కోట్లతో వికారాబాద్ జిల్లాలో బిటి రోడ్డు సదుపాయం లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు శంకుస్థాపన చేశారు.                      

రూ.5 కోట్లతో గిరిజన సంక్షేమ హాస్టల్ భవనానికి భూమి పూజ చేశారు.  రూ.25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ శాశ్వత భవనానికి శంకుస్థాపన  చేశారు.  రూ.40 కోట్లతో సి.సి రోడ్ల నిర్మాణం,  రూ.7.13 కోట్లతో దౌల్తాబాద్ జూనియర్ కాలేజి,  రూ.7.13 కోట్లతో బొమ్రాస్పేట్ జూనియర్ కాలేజి,  రూ.25 కోట్లతో నీటుర్ గ్రామం, దౌల్తాబాద్ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే బిసీ రెసిడెన్షియల్ స్కూల్/కాలేజికి నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు.  రూ.360 కోట్లతో చంద్రకల్ గ్రామం,దౌల్తాబాద్ మండలంలో నూతన వెటర్నరీ కాలేజి ,  రూ.30 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ,  రూ.11 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేశారు.  రూ.20 కోట్లతో మద్దూర్ మండల కేంద్రంలో బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజినని నిర్మించనున్నారు.                           

రూ.25 కోట్లతో కొడంగల్ మండల కేంద్రంలో బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజి, రూ.224.50 కోట్లతో మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజి, ఫిజియోథెరపీ కాలేజి,220 పడకల హాస్పిటల్ ,  రూ.213.2070 కోట్లతో కొడంగల్ నియోజకవర్గంలో హెచ్ఎల్బిఎస్ మరియు R/Fs అప్రోచ్ రోడ్ పనులు,  రూ.3.99 కోట్లతో దుద్యాల్ మండలంలోనీ హస్నాబాద్ గ్రామ నూతన 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ పనులన్నీ శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేవంత్ పర్యటనకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. –             

మరిన్ని చూడండి



Source link

Related posts

Two GHMC Employees Were Arrested for paying the Wages of Sanitation Workers | GHMC NEWS: పారిశుద్ధ్య కార్మికుల సొమ్ము స్వాహా

Oknews

మేడమ్‌ టుస్సాడ్స్‌లో బన్ని విగ్రహం.. తొలి తెలుగు హీరోగా రికార్డ్‌!

Oknews

మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.!

Oknews

Leave a Comment