Rohit Sharma WC Stats: అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల రాజు ఎవరంటే రోహిత్ శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ పేరు చెబుతారు. కానీ అది ప్రపంచ కప్ గురించి మాత్రమే అయితే, కింగ్ కోహ్లీ కంటే హిట్‌మ్యాన్ గణాంకాలే ముందున్నాయి. ప్రపంచకప్‌లో పరుగులు, సెంచరీలు కొట్టడం నుంచి ఫోర్లు, సిక్సర్లు బాదడం వరకు అన్ని విధాలుగా రోహిత్ శర్మ… విరాట్ కంటే మెరుగ్గా ఉన్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే విరాట్ కంటే ఒక్క ప్రపంచకప్ తక్కువగా ఆడినప్పటికీ, బ్యాటింగ్‌లో ప్రతి విభాగంలో రోహిత్ శర్మ అతని కంటే ముందున్నాడు.
విరాట్ కోహ్లీ నాలుగో ప్రపంచకప్ ఆడుతున్నారు. అతను 2011లో తన ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మకి ఇది మూడో ప్రపంచకప్ మాత్రమే. 2015లో రోహిత్ తన మొదటి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడాడు. విరాట్ ఇప్పటివరకు ప్రపంచ కప్‌లో 29 మ్యాచ్‌లు ఆడాడు, అయితే రోహిత్ ఇప్పటివరకు 20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో మాత్రమే కనిపించాడు.
రోహిత్ వర్సెస్ విరాట్ ప్రపంచకప్ గణాంకాలు…
పరుగులు: ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 1195 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 1186 పరుగులు ఉన్నాయి. ప్రపంచకప్ 2023లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ పరుగుల పరంగా విరాట్‌ను అధిగమించాడు.
బ్యాటింగ్ యావరేజ్: ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 66.38 బ్యాటింగ్ సగటుతో పరుగులు చేశాడు. అదే సమయంలో ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు 49.41గా ఉంది.
స్ట్రైక్ రేట్: ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 101.96. అతను విధ్వంసకర శైలిలో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ స్ట్రైక్ రేట్ 86.06గా ఉంది.
సెంచరీలు: ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. ఇప్పటి వరకు ఏడు సెంచరీలు చేశాడు. ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీకి ఇప్పటి వరకు కేవలం రెండు సెంచరీలు మాత్రమే ఉన్నాయి.
అత్యధిక ఫోర్లు: ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 122 ఫోర్లు కొట్టగా, విరాట్ ఖాతాలో 106 ఫోర్లు ఉన్నాయి.
అత్యధిక సిక్సర్లు: ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ మొత్తం 34 సిక్సర్లు కొట్టాడు. ఈ విషయంలో విరాట్ చాలా వెనుకబడ్డాడు. విరాట్ కేవలం ఐదు సిక్సర్లు మాత్రమే బాదాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial