ByGanesh
Mon 04th Mar 2024 11:01 AM
జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి తర్వాత మరో ఛానల్ కి మారి నాగబాబు కూడా నడిచిన కమెడియన్ కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు చేపల పులుసు ఆర్పీ గా మారిపోయాడు. ఏడాది క్రితం కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు కిచెన్ స్టార్ట్ చేసి ఇప్పుడు పాపులర్ అయ్యాడు. అమీర్ పేట, మాదాపూర్, మియాపూర్ ఇంకా అనంతపూర్.. ఇకపై తిరుపతి, విశాఖ, విజయవాడ అంటూ బ్రాంచ్ లు ఓపెన్ చేసే ప్లాన్ లో ఉన్నాడట. అన్నట్టు కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు చాలా కాస్ట్లీ. కోరమీను చేపల పులుసయితే ఆర్పీ దగ్గర కిలో కూర ఏకంగా 1800 రూపాయలు. ఎమన్నా అంటే కోరమీను చాలా కాస్ట్లీ అంటాడు.
అయితే చేపలు దొరికే పరిస్థితిని బట్టి బ్రాంచెస్ కి తాను అనుమతి ఇస్తాను, అగ్రిమెంట్ చదివి, వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు అంటేనే వాళ్ళకి ఫ్రాంచైజీ ఇస్తాను. ఆర్పీ చేపల కూర టేస్ట్ పై ఎలాంటి కంప్లైంట్ రాలేదు. కానీ నీ చేపల కూర కాస్ట్లీ అని ఓ యాంకర్ అడగగానే అవునయ్యా కార్లలో బెంజ్ ఉంది, క్రీటా ఉంది దేని రేంజ్ అది. నువ్వు ఏది కావాలంటే అదే తీసుకుంటావ్. ఇక్కడ కూడా అంతే తక్కువ రకాల చెంపలకి తక్కువ రేటు, ఎక్కువ రేటు చేపల కూరకి ఎక్కువ రేటు ఇస్తాం, చేపలు బాగు చెయ్యడానికి ఒక్కో రేటు ఉంటుంది. చేపల్లో ఉండే రకాలకు అంతే ఉంటుంది. బొమ్మిడాయిలైతే ఆల్మోస్ట్ మటన్ రేటు ఉంది.
మీరు ఊరికే వచ్చేసి జేబులో 100రూ పెట్టుకొని 1000రూ వస్తువు తీస్కోవాలంటే అవ్వదు.. నా చేపల పులుసు రేట్లు ఇలానే ఉంటాయి.. ఇష్టముంటే తిను లేకపోతే పో..! నీ దగ్గర మూడొందలు ఉంటే దానికి తగ్గదే వస్తుంది. అంతేకాదు చట్నీస్ లో 200 పెట్టి దోశ తినే వారూ ఉన్నారు. అలాగే రోడ్డుపక్కన 20 పెట్టి దోశ తినేవారు ఉన్నారు. అలాగే స్టార్ హోటల్ లో బిర్యానీ ఉంది, రోడ్డు పక్కన బిర్యానీ ఉంది అలాగే నా చేపల కూర కూడా అంటూ ఆర్పీ తన చేపల పులుసు రేటు ఎందుకు ఎక్కువో ఆ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు నా రేట్లు ఇలానే ఉంటాయి. క్వాలిటీ ఉంటుంది. అందుకే ఈ రేట్లు తింటే తినండి లేదంటే లేదు అంటూ తేల్చేసాడు.
RP Interview :
Kiraak RP Interview About Nellore Pedda Reddy Chepala Pulusu