Latest NewsTelangana

SA 2 exams would be conducted from march 8 to 18 in Telangana Schools check exam results date here | TS SA2 Exam Schedule: విద్యార్థులకు అలర్ట్


TS SA@ Exams: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని స్కూళ్లలో ఒకటి నుంచి 9వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి మార్చి 11న పరీక్షల టైమ్ టేబుల్​ను విడుదల చేశారు. ఎస్‌ఏ-2 పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 19 వరకు కొనసాగనున్నాయి.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 8, 10, 13, 15 తేదీల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు ఏప్రిల్ 8, 10, 13, 15, 16, 18 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి.

అయితే, 8వ తరగతి విద్యార్థులకు సైన్స్ పేపర్ మాత్రం ఉదయం ఫిజిక్స్, మధ్యాహ్నం బయాలజీ నిర్వహించనున్నారు. మిగిలిన అన్ని పరీక్షలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.45 గంటల వరకూ నిర్వహిస్తారు. ఒక్క 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఏప్రిల్ 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. సైన్స్ పేపర్‌ను మాత్రం రెండు రోజుల్లో వేర్వేరుగా నిర్వహించనున్నట్లు ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు.

వేసవి సెలవులు ఎప్పుడంటే?
SA-2 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు. అదేరోజు పేరెంట్స్ మీటింగ్ ద్వారా విద్యార్థులు ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రుదలకు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. అంటే తెలంగాణలోని పాఠశాలలకు 49 రోజులపాటు వేసవి సెలవులు రానున్నాయి.

TS SA2 Exam Schedule: విద్యార్థులకు అలర్ట్ -  ఏప్రిల్ 8 నుంచి 'సమ్మెటివ్-2' పరీక్షలు, వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?

TS SA2 Exam Schedule: విద్యార్థులకు అలర్ట్ -  ఏప్రిల్ 8 నుంచి 'సమ్మెటివ్-2' పరీక్షలు, వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?

 

మరిన్ని చూడండి



Source link

Related posts

Bad news for Akkineni fans అక్కినేని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్

Oknews

చిరంజీవి కి 100 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు  ఫిక్స్ అయ్యారా!

Oknews

Hyderabad Wine shops would be closed on April 17th due to Sri Ramnavami

Oknews

Leave a Comment