Telangana

Sangareddy District : మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ



పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఖాజాగూడకు చెందిన సంపంగి యాదయ్య (36) ఐడిఏ బొల్లారంలోని బీరప్ప బస్తీలో పది సంవత్సరాలుగా నివాసం ఉంటూ రాళ్ళూ కొట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాదయ్యకు భార్య,ఇద్దరు కొడుకులు,ఒక కూతురు ఉన్నారు. చేర్యాల గ్రామానికి చెందిన రాజు కూడా రాళ్ళూ కొట్టుకుంటుండడంతో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. కాగా మంగళవారం రాత్రి రాజు తో కలిసి యాదయ్య మద్యం తాగడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగగా కోపోద్రిక్తుడైన రాజు తాగిన మైకంలో బండ రాయితో బలంగా యాదయ్య తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులో ఉండటంతో రాజు కూడా అక్కడే పడిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అక్కడికి చేరుకున్నారు. ఘటన స్థలంలోనే నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదయ్య మృతి చెందడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Source link

Related posts

Bhadradri Sri Rama Navami celebrations 2024 Sri Sita Ramula Kalyanam special tickets for bhadrachalam kalyanam online booking

Oknews

‘టెట్’ నోటిఫికేషన్ ఉంటుందా…! అభ్యర్థుల డిమాండ్లపై సర్కార్ స్పందించేనా..?-teacher job candidates are demanding to conduct telangana tet exam context of dsc recruitment 2024 ,తెలంగాణ న్యూస్

Oknews

Adilabad Congress List: కాంగ్రెస్‌ తొలి జాబితాలో ముగ్గురికే దక్కిన చోటు

Oknews

Leave a Comment