Latest NewsTelangana

sensational issues in brs mla lasya nanditha psotmortem report | Lasya Nanditha: రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి


Mla Lasya Nanditha Postmortem Report: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే మృతి చెందినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదకలో తేలింది. ఆమె మృతికి సంబంధించిన వివరాలను గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలు కాగా.. ‘తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కుడి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆరు దంతాలు ఊడిపోయాయి.’ అని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని.. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ ను ఢీకొనగా.. ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలు కాగా.. స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే, పూర్తిగా దర్యాప్తు చేసిన అనంతరమే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అటు, గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం కార్ఖానాలోని నివాసానికి ఆమె పార్థివ దేహాన్ని తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. పలువురు నేతలు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఈస్ట్ మారేడ్ పల్లిలోని శ్మశాన వాటికలో శుక్రవారం సాయంత్రం లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె తండ్రి సాయన్న అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ఆమె అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కేసీఆర్ పరామర్శ

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కార్ఖానాలోని నివాసంలో లాస్య నందిత పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కేకే, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డితో పాటు ఇతర నాయకులు లాస్య నందితకు నివాళి అర్పించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించనున్నారు. 

Also Read: Lasya Nanditha: అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు – సీఎం రేవంత్ ఆదేశాలు, పార్థివ దేహానికి కేసీఆర్ నివాళి

మరిన్ని చూడండి



Source link

Related posts

Hyderabad News : హైదరాబాద్ లో నామినేషన్లకు సర్వం సిద్ధం, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

Oknews

ఓపెన్ బుక్ మనం.. ఎవడికీ భయపడే పనేలేదు

Oknews

మైనర్​ బాలికపై రేప్​ అటెంప్ట్​… సీఐపై పోక్సో కేసు నమోదు-pocso case registered against ci sampath in warangal ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment