ByGanesh
Mon 09th Oct 2023 11:28 AM
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అంగళ్లు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో.. ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై మధ్యాహ్నం తీర్పును వెలువరించనుంది.
ఇక ఏసీబీ కోర్టు విషయానికి వస్తే.. లంచ్ తర్వాతే చంద్రబాబు బెయిల్, కస్టడీపై తీర్పు వెలువడనుంది. అలాగే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై కూడా ఇవాళ విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎలాంటి తీర్పు వెలువడుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.
Shock for Chandrababu in AP High Court:
Big shock for Chandrababu in AP High Court