ByGanesh
Sat 14th Oct 2023 09:59 AM
మహిళలు 40 బడిలో అడుగుపెడుతున్నారంటే రకరకాల ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ తో సతమతమవుతున్నారు. కొంతమంది మానసిక సమస్యలని ఫేస్ చేస్తున్నారు. ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా సెలబ్రిటీస్ ఉండడం గమనార్హం. తాజాగా ఈ మానసిక సమ్యలను అధిగమించేందుకు సలార్ బ్యూటీ శృతి హాసన్ కొన్ని టిప్స్ చెబుతుంది.
ఆరోగ్యం కంటే ఎవరికి ఏదీ ఎక్కువ కాదు, మానసిక వ్యాధిని బాగు చేసుకోవడానికి చాలా ఆసుపత్రులు ఉన్నాయి. కానీ డిప్రెషన్ సమస్యల గురించి ఎవరూ బయటకి చెప్పడమే లేదు.. నేనైతే వాటి గురించి డైరీలో రాసుకుంటాను. రోజు జిమ్ చేస్తాను, దీని వలన శరీరంలోని రసాయనాలు, హార్మోనులు సమతుల్యంగా ఉంటాయి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా రోజు నాకు నచ్చిన వాళ్లతో మట్లాడుతూ ఉంటాను.
నేను మాట్లాడే వ్యక్తి మనసుని అర్ధం చేసుకోవడానికి ట్రై చేస్తాను, సోషల్ మీడియాలో నాపై వచ్చే కామెంట్స్ లో మంచి, చెడు గురించి ఆలోచిస్తాను.. ఇలా చేస్తే చాలావరకు రిలీఫ్ ఉంటుంది అంటూ శృతి హాసన్ డిప్రెషన్ కి లోనయ్యే వారికి కొన్ని టిప్స్ షేర్ చేసింది.
Shruti Haasan gives tips for mental problems:
Shruti Haasan Shares 5 Self Care Tips For Good Mental Health