GossipsLatest News

Shruti Haasan Says Thanks to Doctors and Nurses శృతిహాసన్ వాళ్లకి థ్యాంక్స్ చెప్పింది



Mon 23rd Oct 2023 08:29 AM

shruti haasan,viral fever,thanks,doctors  శృతిహాసన్ వాళ్లకి థ్యాంక్స్ చెప్పింది


Shruti Haasan Says Thanks to Doctors and Nurses శృతిహాసన్ వాళ్లకి థ్యాంక్స్ చెప్పింది

శృతిహాసన్ తానేదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా దానిని దాచుకోకుండా ఆమె సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంది. గతంలో తాను ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనే విషయాలని షేర్ చేసింది. తాజాగా ఆమె ఫీవర్‌తో బాధపడుతున్నట్టుగా చెప్పింది. కొద్దిరోజులుగా తనని ఫీవర్ ఇబ్బంది పెడుతుంది అని, అది డెంగ్యూ అయి ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే తనకు వచ్చింది డెంగ్యూ కాదని, వైరల్ ఫీవర్ అని క్లారిటీ ఇచ్చింది. ఫీవర్ అనుకుంటే అది తనని చాలా ఇబ్బంది పెట్టడమే కాదు.. పడుకోబెట్టేసింది.

నన్ను చాలా వీక్‌గా చేసింది.. ఇప్పుడు ఆ వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నాను, నాకు స్పెషల్‌గా ట్రీట్ చేసిన డాక్టర్స్‌కి, నన్ను ఎంతో కేర్‌గా చూసుకున్న నర్సులకి స్పెషల్ థాంక్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. అయితే శృతిహాసన్ ఈ నెల 26న మీకో సర్‌ప్రైజ్ అంటూ ఊరిస్తూ వస్తుంది. ఆమె చెప్పబోయే సర్‌ప్రైజ్ ఏమిటో అనే ఆతృతగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ శాంతానుతో పెళ్లి డేట్ ఎనౌన్స్ చేస్తుందో.. లేదంటే ఏమైనా కొత్త బిజినెస్ గురించి రివీల్ చేస్తుందో అంటూ రకరకాలుగా ఊహించుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అలాగే నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హాయ్ నాన్న సినిమాలోనూ ఓ స్పెషల్ పాత్రను ఆమె చేస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


Shruti Haasan Says Thanks to Doctors and Nurses:

Shruti Haasan Suffered with Viral Fever









Source link

Related posts

Is tdp and Janasena Sacrifice for BJP BJP కోసం ఈ త్యాగాలు అవసరమా?

Oknews

అదే ఆయన గొప్పతనం.. విజయ్‌ ఆంటోనిపై నెటిజన్ల ప్రశంసలు

Oknews

లారెన్స్‌ అందించిన సాయానికి ఎమోషనల్‌ అయిన మహిళ.. వీడియో వైరల్‌!

Oknews

Leave a Comment