Sports

Shubman Gill Becomes Fastest Indian Batter To Get Six ODI Centuries | Shubman Gill: రోహిత్, విరాట్ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్


Shubman Gill Records: భారత జట్టు యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ 2023 సంవత్సరంలో బ్యాట్‌తో తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఆసియా కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్ బ్యాట్ చాలా గట్టిగా మాట్లాడింది. తొలి వన్డేలో 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, ఇండోర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 104 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. వన్డే కెరీర్‌లో శుభ్‌మన్ గిల్‌కి ఇది ఆరో సెంచరీ.

వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. గిల్ తన 35వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని సాధించాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. అతను 46 వన్డే ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ 53 ఇన్నింగ్స్‌ల్లో, విరాట్ కోహ్లీ 61 ఇన్నింగ్స్‌లలో ఆరు వన్డే సెంచరీలు సాధించగలిగారు.

2023లో శుభ్‌మన్ గిల్ 20 ఇన్నింగ్స్‌ల్లో 72.35 సగటుతో 1230 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి ఐదు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ మూడుసార్లు అజేయంగా నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీని కూడా శుభ్‌మన్ గిల్ సాధించాడు.

వన్డే ఫార్మాట్‌లో ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 1998లో 33 వన్డే ఇన్నింగ్స్‌లలో 65.31 సగటుతో 1894 పరుగులు చేశాడు. ఆ సంవత్సరం తొమ్మిది సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు కూడా సచిన్ బ్యాట్ నుంచి కనిపించాయి.

ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ఈ 25 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగలడు. ఈ సంవత్సరం శుభ్‌మన్ గిల్ ఈ మార్కుకు 664 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్‌కి కనీసం 9 మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించనుంది. దీని తర్వాత ఏడాది చివరిలో దక్షిణాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా మరో మ్యాచ్ మిగిలి ఉంది. అంటే ఇంకా 13 ఇన్నింగ్స్ వరకు గిల్ ఆడే అవకాశం ఉంది.

టీమిండియా  స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్  ప్రపంచకప్‌లో ఆడేది అనుమానంగానే ఉంది. ఆసియా కప్ ఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో  గాయపడ్డ అక్షర్ ప్రస్తుతం  బెంగళూరులోని  నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో  రెండు వన్డేలకు దూరమైన అతడు మూడో వన్డే వరకైనా అందుబాటులో ఉంటాడని టీమిండియా భావించినా  అతడు ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్‌‌నెస్ సాధించలేదు. రాజ్‌కోట్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య  జరుగబోయే మూడో వన్డే నుంచి అక్షర్ తప్పుకున్నాడు.  ఆసియా కప్‌లో భాగంగా  బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అక్షర్ గాయపడ్డాడు. ఎడమ కాలు తొడ కండరాలలో  అతడికి గాయం అయినట్టు సమాచారం.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Related posts

Bowling Coach Doesnt Interfere much Axar Patel Reveals Astonishing Jasprit Bumrah Facts

Oknews

IND Vs AUS: India Won By 5 Wickets Against Australia In 1st ODI | IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ

Oknews

IPL 2024 Points Table update after half of the matches done

Oknews

Leave a Comment