ByGanesh
Fri 26th Jan 2024 12:27 PM
కోలీవుడ్ హీరో శింబు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా ప్రస్తుతం కూల్ గా లైమ్ టైమ్ లోకి వచ్చేసాడు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో హడావిడి మొదలు పెట్టాడు. సూపర్ మేకోవర్ తో కనబడుతున్న శింబు.. కోలీవుడ్ లో పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినా.. ప్రెజెంట్ మాత్రం శింబు.. కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దేశీయ పెరియస్వామి డైరెక్టర్ గా చేస్తారని టాక్ ఉంది. ఈ చిత్రంలో శింబు హీరోగానూ, అలాగే విలన్ గాను రెండు పాత్రల్లో నటించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
అంతేకాకుండా ఈ చిత్రంలోనే శింబు ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ తో జత కట్టబోతున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. పియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో పాత్రకి ఓ హీరోయిన్, విలన్ పాత్రకి మరో హీరోయిన్ ని సెట్ చేశారట. అందులో విలన్ పాత్రకి బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించనున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అలాగే హీరో పాత్రకి కీర్తి సురేష్ జత కడుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒకటే కథనాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరి హీరోయిన్స్ తో శింబు ఎంత రొమాంటిక్ గా రెచ్చిపోతాడో చూడాలి.
Simbu To Romance Deepika Padukone:
Simbu To Romance Deepika Padukone In Kamal Haasan Production