ByGanesh
Fri 22nd Sep 2023 03:18 PM
సోమవారం వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేకంగా పూజలు చేసారు. మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు, రామ్ చరణ్ కుమార్తె క్లింకార తో కలిసి ఈ వినాయకచవితిని తన ఇంట్లోనే స్పెషల్ గా జరుపుకుంటే అల్లు అర్జున్ తన కూతురు ఆర్హ తయారు చేసిన వినాయకుడితో పూజలు చేశారు.
వరుణ్ తేజ్ కాబోయే భార్య లావణ్య త్రిపాఠితో కలిసి తన ఇంట్లోనే తల్లితండ్రులు నాగబాబు-పద్మజ సమక్షంలో నిర్వహించారు. ఇక విజయ్ దేవరకొండ అతని తమ్ముడు, తల్లి తండ్రులతో కలిసి వినాయకుడికి పూజలు చేసారు.
అలాగే సూపర్ స్టార్ మహేష్ ఇంట్లోనూ వినాయకుడికి ఈ ఏడాది ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వినాయకచవితి తర్వాత మహేష్ ఇంట్లో బుజ్జి గణపయ్యల నిమజ్జనాన్ని ఆయన పిల్లలు సితార-గౌతలు నిర్వహించారు. తమ ఇంట్లోనే పని చేసే సర్వెంట్స్ తో కలిసి గౌతమ్-సితార లు తమ కాంపౌండ్ లోనే వినాయకుడిని ఊరేగిస్తూ టబ్బులో వినాయకుడికి పూజలు చేస్తూ నిమజ్జనం చేసిన ఫొటోస్ వైరల్ అయ్యాయి.
Sitara-Gautam in Vinayaka immersion:
Sitara and Gautham Participate in ganesh nimajjanam