GossipsLatest News

Skanda OTT streaming postponed స్కంద ఓటిటి స్ట్రీమింగ్ వాయిదా



Fri 27th Oct 2023 04:02 PM

skanda ott release  స్కంద ఓటిటి స్ట్రీమింగ్ వాయిదా


Skanda OTT streaming postponed స్కంద ఓటిటి స్ట్రీమింగ్ వాయిదా

రామ్ పోతినేని-బోయపాటి కలయికలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్యాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన స్కంద మూవీ ని ప్రేక్షకులు బావుంది అన్నా.. ఆ సినిమాకి అనుకున్న మేర కలెక్షన్స్ రాలేదు. అఖండతో భారీ విజయాన్ని మూటగట్టుకున్న బోయపాటి స్కంద అంచనాలు రీచ్ అవడంలో తడబడ్డారు. థమన్ మ్యూజిక్ కూడా హెల్ప్ చెయ్యలేకపోయింది. సెప్టెంబర్ 15 నే విడుదల అని ప్రకటించిన స్కందని సలార్ పోస్ట్ పోన్ అవడంతో సెప్టెంబర్ 28 న విడుదల చేసారు.

లాంగ్ వీకెండ్ ని స్కంద ఏమాత్రం వాడుకోలేకపోయింది. ఇక థియేటర్స్ లో సో సో గా ఆడిన స్కంద ఈరోజు అంటే అక్టోబర్ 27 న స్ట్రీమింగ్ అవుతుంది అని ప్రకటించారు. డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వాల్సిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యింది. ఈరోజు స్ట్రీమింగ్ అవ్వాల్సిన ఈ చిత్రం ఓటిటిలోకి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే అంటున్నారు. కొత్త స్ట్రీమింగ్ డేట్ ని డిస్ని ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయాల్సివుంది. 


Skanda OTT streaming postponed:

Skanda OTT release date yet to be announced









Source link

Related posts

పొలంలో కేసీఆర్.. ప్లే గ్రౌండ్‌లో రేవంత్!

Oknews

Crazy update on Kaithi 2 ఖైదీ 2 పై క్రేజీ అప్ డేట్

Oknews

Nalgonda News ACB Raids On Marriguda Tahsildar Mahender’s House And Found Huge Bundles Of Currency Notes | Nalgonda News: మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు

Oknews

Leave a Comment