Health Care

Snake : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పాము ఏదో, అది ఎక్కడుందో తెలుసా?


దిశ, ఫీచర్స్ : పాములు అనేక రకాలు. అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో ఇవి కనిపిస్తుంటాయి. ఇక చాలా మంది పాములంటే భయపడిపోతుంటారు. కానీ వాటి గురించి మాత్రం ప్రతీ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొందరు పాములకు మెదడు ఉండదు, అవి ఏదైనా చూసినా మర్చిపోతాయి అని చెప్తుంటారు. ముఖ్యంగా వాటికి తెలివి అనేదే ఉండదు అంటుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత తెలివైన పాము కూడా ఉన్నదంట. ఇంతకీ అది ఏ పాము అనుకుంటున్నారా? నాగుపాము.

భారతదేశంలో నాగు పాములు ఎక్కువగా కనిపిస్తాయి. అంతే కాకుండా ఇక్కడి ప్రజలు దీనిని దేవతగా కొలుస్తూ, పూజలు చేస్తారు. అలాగే ఈ పాము గురించి అనేక వార్తలు కూడా వస్తుంటాయి. ఒక వ్యక్తిని పదే పదే కాటు వేసిన ఒకే పాము. ఓ వ్యక్తిని పగబట్టిన పాము అనుకుంటూ అనేక వార్తలు మనం చూస్తుంటాం. అయితే నాగు పాముకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా ఇది ఇతర పాముల కంటే ఎక్కువగా చూడగలదంట, మనుషులను ఈజీగా గుర్తుపడుతుంది. అందుకే ప్రపంచంలో 3000ల జాతులకు పైగా, పాములున్నా, ఈ పాముకు మాత్రమే ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది పరిస్థితులను బట్టీ ఈజీగా తన వ్యూహాన్ని మార్చుతుందంట. అంతే కాకుండా భూమిలో ప్రకంపనలను అనుభవించడం, 330 అడుగుల దూరం నుంచే వేటను గమనించడంలో దీనిని మించిన పాము లేదంట. అందుకే ప్రపంచంలో అత్యంత తెలివైన పాము అంటే అది నాగు పామే అంటున్నారు నిపుణులు.



Source link

Related posts

Viral : ఓర్నీ.. ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్ చేస్తే.. ఆరేండ్లకు వచ్చాయ్ !

Oknews

సమ్మర్‌లో శక్తికి మించిన వ్యాయామాలతో నష్టం.. ఏం జరుగుతుందంటే..

Oknews

మొదటి పీరియడ్ గురించి పిల్లలకు ఏ వయసులో చెప్పాలంటే?

Oknews

Leave a Comment