Health Care

Snakes: పాములకు ఇది లక్ష్మణ రేఖతో సమానం.. ఇంటి చుట్టూ చల్లితే ఎంతటి విషసర్పమైనా పరార్..!


దిశ, ఫీచర్స్: ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. దీంతో వివిధ రోగాలతో పాటు విష సర్పాలు కూడా వస్తుంటాయి. వరదల కారణంగా పాములు, తేళ్లు వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ జనావాసాల్లోకి చేరుతుంటాయి. షూ రాక్‌లు, కోళ్ల గూళ్లు, ఇంటి సందులు, బాత్‌రూమ్‌లలో దూరి నక్కి ఉంటాయి. ఇలా పాములు ఇళ్లల్లోకి దూరకుండా చేసేందుకు ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ పాములు ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో పాములు మీ ఇంటి పరిసరాల్లోకి రాకుండా ఉంచే కెమికల్స్‌, స్ప్రేలు కొన్ని ఉన్నాయి. అవి పాముల పాలిట లక్ష్మణరేఖగా పనిచేస్తాయి. వాటిని ఉపయోగించినట్లయితే, పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి.

*వాస్తవానికి, వర్షాల సమయంలో, పాముల పుట్టలు, రంధ్రాలు నీటితో నిండి పోతాయి. కాబట్టి పాములు వాటి రక్షణ కోసం పొడి ప్రదేశంలో దాక్కుంటాయి. మీ ఇంటి చుట్టుపక్కల రంద్రాలు, చిదూ, పాములు దూరేందుకు అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు ఫినాయిల్‌ ద్రవాన్ని చల్లుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

*వర్షాకాలంలో ఇంట్లోని మూలలు, కోళ్లగూడు, పశువుల పాకలు, బాత్‌రూమ్‌ వంటి ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అప్పుడప్పుడు ఫినాయిల్‌ పిచికారీ చేస్తే పాములు ప్రవేశించవు. ఎందుకంటే, ఇందులో కార్బోలిక్ యాసిడ్ ఉంటుంది. దీని వాసన వల్ల పాములు, తేళ్లు, క్రిములు ఇంట్లోకి రావు. ఇంట్లోని స్టోర్ రూమ్, చెత్త ఏరియాని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంటి చుట్టూ కార్బోలిక్ యాసిడ్ చల్లితే పాములు రావు.

*అలాగే మీరు బహిరంగ ప్రదేశంలో ఫినాయిల్‌ పిచికారీ చేస్తే, వర్షం పడినప్పుడు వర్షం నీటితో పాటు కొట్టుకుపోతుంది. అందువల్ల, మీరు మీ ఇంటి చుట్టూ ఒరిజినల్ కార్బోలిక్ యాసిడ్‌ను పిచికారీ చేయాలి. దాని ప్రభావం ఒక వారం పాటు ఉంటుంది. వాసన వస్తూనే ఉంటుంది. దీని కారణంగా పాము ఇంట్లోకి ప్రవేశించదు. వర్షాకాలంలో ప్రతి వారం ఈ పనిని చేస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.



Source link

Related posts

దుఃఖంలో కూరుకుపోయారా..? ఆరోగ్యానికి మంచిదేనంటున్న నిపుణులు!

Oknews

వర్షం పడినప్పుడు ఆకాశంలో మెరుపులు ఎందుకు వస్తాయో తెలుసా?

Oknews

రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Oknews

Leave a Comment