ByGanesh
Wed 03rd Apr 2024 06:30 PM
సంక్రాంతికి ముందు ప్రశాంత్ వర్మ, నిర్మాతలు హనుమాన్ రిలీజ్ విషయంలో ఎందుకంతగా పట్టుబట్టారో అనేది ఆ సినిమా విడుదలయ్యాక కానీ దాని సత్తా తెలియలేదు. విజువల్ వండర్ గా హనుమాన్ పాన్ ఇండియా ప్రేక్షకులని విశేషంగా ఆకర్షించింది, చిన్న సినిమా దీనికి అంత సీన్ లేదు అన్నవారే హనుమాన్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోయారు. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూత్ పదే పదే చూసారు. థియేటర్స్ కి రిపీటెడ్ ఆడియన్స్ వెళ్లారు. దానితో హనుమాన్ చిత్రం 350 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది.
సౌత్ నుంచి నార్త్ వరకు దుమ్మురేపిన హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ని అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఆ చిత్రం పై ఏ చిన్న అప్ డేట్ వదిలినా అది క్షణాల్లో వైరల్ అవడం కాదు.. యూత్ గూగుల్ లోజై హనుమాన్ అప్ డేట్స్ ఎంతెలా వెతికేస్తున్నారో చెపుకర్లేదు. రీసెంట్ గా అంజనాద్రి 2.0 ని చిన్నపాటి వీడియోతో పరిచయం చెయ్యగా అది సెన్సేషన్ క్రియే చేసింది. అది చూసిన నెటిజెన్స్.. ఏంట్రా జై హనుమాన్ పై ఇంత క్రేజ్ ఉంది అంటూ షాకవుతున్నారు.
ఇక జై హనుమాన్ ఫస్ట్ లుక్ ఏప్రిల్ 17 శ్రీరామనవమి స్పెషల్ గా రావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మరి ప్రశాంత్ వర్మ స్రిప్ట్ వర్క్ అయితే ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ ఫస్ట్ లుక్ విషయం ఏం చేస్తాడో చూడాలి, అసలే 2025 సంక్రాంతి రిలీజ్ అంటూ ఎప్పుడో అనౌన్స్ కూడా చేసాడు.
So crazy about Jai Hanuman?:
Jai Hanuman update