ByGanesh
Thu 19th Oct 2023 07:24 PM
హీరో విజయ్ పై కోలీవుడ్ లో ఇంత నెగిటివిటి ఉందా.. అంటే సోషల్ మీడియా చూస్తే అది నిజమే అనిపిస్తుంది. కోలీవుడ్ లో హీరో విజయ్ నటించిన లియో మూవీ ఆడియో లాంచ్ జరక్కుండా అడ్డుకున్నారంటూ స్టాలిన్ ప్రభుత్వంపై విజయ్ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. అటు అజిత్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా విజయ్ లియో పోవాలని కోరుకున్నారు. ఇప్పుడు కాస్త టాక్ తేడా పడేసరికి #LeoDisaster హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. లియో ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ మరీ నీరసంగా ఉంది.. అసలు లోకేష్ కనగరాజ్ ఏమిటి ఇంత మోసం చేసాడు. విక్రమ్ ని చూసిన కళ్ళతో లియో చూడలేకపోయామంటూ మాట్లాడుతున్నారు.
సంజయ్ దత్, అర్జున్, త్రిష ఇలా ఎవ్వరిని సరిగ్గా వాడనుకోకుండా కేవలం విజయ్ మీదే లోకేష్ ఫోకస్ పెట్టాడు. విజయ్ ని పట్టించుకోవడం మొదలు పెట్టి కథ, కథనాలు పక్కనపెట్టేశారు, LCU అంటూ ఆసక్తిని క్రియేట్ చేసి నిండా ముంచేశాడు.. బాబోయ్ లియో సినిమా చూసాక వాళ్ళ మొహాలు చూడండి అంటూ థియేటర్స్ వీడియో ని స్ప్రెడ్ చేస్తున్నారు. విజయ్ కి బీస్ట్-వారిసు ఇప్పుడు లియో మూడు హ్యాట్రిక్ డిజాస్టర్స్ తగిలాయంటూ సోషల్ మీడియాలో హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
లియో పై క్రేజ్ తో మొదటి రోజు మొదటి షో చూడాలని థియేటర్స్ కి వెళితే లియో ఇంత నిరాశ పరుస్తుందా అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫాన్స్ రచ్చ చేస్తున్నారు. విజయ్ అభిమానులు లోకేష్ కనగరాజ్ ని తిట్టిపోస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అమ్మో హీరో విజయ్ పాలిటిక్స్ లోకి వస్తాడేమో అని అతన్ని బాగా తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో అతనిపై ఇంత నెగిటివిటి చిమ్ముతున్నారంటూ గుసగుసలు మొదలయ్యాయి.
So much negativity on Hero Vijay..:
Leo Disaster hashtag trends on twitter