ByGanesh
Sun 25th Feb 2024 01:59 PM
అమ్మాయిలు పెళ్లి కాకూండా మాతృత్వాన్ని కోరుకోవడం అనేది నిజంగా విడ్డురమే. కానీ శోభిత దూళిపాళ్ల మాత్రం ఎప్పటికైనా మాతృత్వాన్ని అనుభవించాలనుకుంటుందట. ఆ సమయం ఎప్పుడు వస్తుందో కాని.. మాతృత్వంలోని తీయదనం తనకి ఎప్పుడు దక్కుతుందో అంటూ సెన్సేషనల్ గా మాట్లాడింది. ప్రస్తుతం హాలివుడ్ రేంజ్ సినిమాలు చేస్తున్న శోభిత దూళిపాళ్ల గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ తో అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంటుంది.
బాలీవుడ్ సీరీస్, సినిమాల్లో ఫేమస్ అయిన శోభిత దూళిపాళ్ల పేరు నాగ చైతన్య తో ముడిపెట్టి గట్టిగా వినిపించింది. సమంత తో విడిపోయాక నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడు అనే ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ కి శోభిత స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది. తప్పు చెయ్యనప్పుడు స్పందించడమెందుకు అంటూ సింపుల్ గా తేల్చేసింది. అయితే తాజాగా శోభితాని మీ జీవితానికి అర్ధం ఏమై ఉంటుంది అని మీరు భావిస్తున్నారు అన్న ప్రశ్నకి శోభిత మట్లాడుతూ.. జీవితానికి ఓ లక్ష్యం అంటూ ఉంటుంది అని నేననుకోను, ఈ తీరం నుంచి ఆ తీరానికి ప్రయాణం చేస్తూ ఉండాలి. నాకంటూ గొప్ప లక్ష్యాలు లేవు, కాబట్టి ఏదో పొగొట్టుకున్నదానిలా ఉండలేను.
నా లైఫ్ లో నేను ఎక్కువగా కోరుకునేది మాతృత్వాన్ని. నిజంగా దానిని నేనెప్పుడు అనుభవిస్తానో కానీ దాన్నో అద్భుతంలా ఫీలవుతాను. అమ్మనవడం, అమ్మ అని పిలుపించుకోవడం ఎంత బావుంటుందో.. నేనెప్పుడు తల్లినవుతానో అనే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ శోభిత చెప్పుకొచ్చింది.
Sobhita Dhulipala is looking forward to motherhood:
Sobhita Dhulipala on Looking Forward to Motherhood: Whenever That Happens, I feel…