Sports

South Africa Reaches Top Spot In World Cup 2023 Points Table Check Details | World Cup Points Table: పాయింట్ల పట్టికలో తిరిగి టాప్‌ ప్లేస్‌కు సౌతాఫ్రికా


World Cup 2023 Points Table Update: వన్డే ప్రపంచ కప్ 2023 32వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. న్యూజిలాండ్ ఓటమి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లకు మరోసారి ఆశలు రేకెత్తించింది. విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా ఆతిథ్య భారత్‌ను దాటి పట్టికలో నంబర్‌వన్‌ను కైవసం చేసుకోగా, ఓడిన న్యూజిలాండ్‌ నాలుగో స్థానానికి పడిపోయింది.

న్యూజిలాండ్‌కు టోర్నీలో ఇది ఏడో మ్యాచ్. కివీ జట్టు 7 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఉంది. ఐదు, ఆరో స్థానాల్లో ఉన్న పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లు చెరో 6 పాయింట్లతో ఉన్నాయి. పాకిస్థాన్ ఏడు మ్యాచ్‌లు ఆడగా, ఆఫ్ఘనిస్థాన్ ఆరు మ్యాచ్‌లు ఆడింది. అటువంటి పరిస్థితిలో మిగిలిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలిస్తే, టాప్-4లో కొనసాగడానికి ఇద్దరి మధ్య నెట్ రన్ రేట్ తేడా కనిపిస్తుంది.

న్యూజిలాండ్‌పై విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా 12 పాయింట్లు పొందింది. దీని కారణంగా ప్రోటీస్ జట్టు భారతదేశాన్ని అధిగమించి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఆతిథ్య భారత్‌కు కూడా 12 పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ తేడాతో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. ఓడిపోయిన న్యూజిలాండ్ మ్యాచ్‌కు ముందు మూడో స్థానంలో ఉండగా, మ్యాచ్ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మెరుగైన నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానానికి చేరుకుంది.

మిగతా జట్ల పరిస్థితి ఇలా
టాప్-4 జట్ల తర్వాత పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ఆరేసి పాయింట్లతో వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత శ్రీలంక, నెదర్లాండ్స్ నాలుగేసి పాయింట్లతో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్, ఇంగ్లండ్ రెండేసి పాయింట్లతో తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ మాత్రమే అధికారికంగా టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.



Source link

Related posts

వరల్డ్‌కప్ వీరులకు హోటల్‌లో హైటెక్ స్వాగతం..!

Oknews

CSK vs GT Match Highlights IPL 2024: చెన్నై ఆల్ రౌండ్ విక్టరీ, ఆరో టైటిల్ కోసం ఆవురావురమంటూ..!

Oknews

Under-19 World Cup India Register Massive Win Againist New Zealand 

Oknews

Leave a Comment