Special tests will be given to those who drive VIP cars in Telangana : ప్రజా జీవితంలో నిత్యం తీరిక లేకుండా గడిపే రాజకీయ నాయకులు సమయం చూసుకోకుండా ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఇదే ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రమాద ఘటనతో ప్రముఖుల ప్రయాణాలపై చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. సుమోటోగా తీసుకుని ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రవాణాశాఖ ఎక్కడికక్కడ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతిభ లేని డ్రైవర్లను విధుల్లో పెట్టుకోవద్దని మంత్రి సూచించారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రవాణా శాఖ ఎక్కడక్కడ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ప్రతిభ లేని డ్రైవర్లను ఎవరిని కూడా విధుల్లో ఉంచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. ఆటోడ్రైవర్లకు సాయం పథకంపై కసరత్తు చేస్తున్నారన్నారు. మహాలక్ష్మీ పథకంలో కండక్టర్లు అనవసరంగా టికెట్లు జారీ చేసినట్లు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదానికి సంబంధించిన మరో కీలక సమాచారం ఇస్తుందని పటానచెరు పోలీసులు ఆశిస్తున్నారు.ఈ సందర్భంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేసినట్లు లాస్య నందిత పీఏ ఆకాష్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. రెయిలింగ్ కు ఢీ కొట్టుకున్న సమయానికి ముందు లాస్య నందిత కారు మరో వాహనాన్ని ఢీ కొట్టిందని, 500 మీటర్ల దూరం నుంచి పడ్డ టైర్ మరకలు, ఊడిపడ్డ హెడ్ లైట్ తో పోలీసులు నిర్ధారించుకున్నారు.
సుల్తాన్ పూర్ సీసీ కెమెరా ద్వారా ప్రమాదానికి ముందు ఎన్ని వాహనాలు లాస్య నందిత కారును దాటుకుని వెళ్లాయని, వాటిని గుర్తిస్తున్నట్లు పటానచెరు పోలీసులు ఇప్పటికే కొన్ని వాహనాలను గుర్తించి వారిలో కొంత మందిని పిలిచి ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. పీఏ ఆకాష్ ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత అతని నుంచి స్టేట్మెంట్ తీసుకోనున్నారు. ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకున్నా…. ఎమ్మెల్యే లాస్య నందిత ఎందుకు మృతి చెందిదనే అంశం పై పటానచెరు పోలీసులు కారు లలో భద్రతను కల్పించే సంస్థలకు చెందిన నిపుణలతో నివేదికను తీసుకొనున్నారు.
మరిన్ని చూడండి