GossipsLatest News

Sreeleela comments on future plans అలా చేయలేనంటున్న శ్రీలీల


మొన్నటివరకు వరస వైఫల్యాలతో డిజ్ పాయింట్ అయిన శ్రీలీల ప్రస్తుతం మళ్ళీ బిజీగా మారడంతో ఆమె అభిమానులు చాలా రిలాక్స్ అవుతున్నారు. పెళ్లి సందడి చిత్రం తర్వాత వరసగా ఏడెనిమిదిమంది హీరోలు పిలిచి అవకాశాలు ఇచ్చేసరికి.. ఉక్కిరి బిక్కిరైన శ్రీలీల అవి ఫెయిల్యూర్ అవడంతో ఢీలా పడిపోయింది. ఇంకేంటి శ్రీలీల పనైపోయింది అన్నారు. 

కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్లుగా, పడి లేచిన కెరటంలా శ్రీలీల టైమ్ స్టార్ట్ అయ్యింది. రవితేజ సినిమా అలాగే నితిన్ సినిమాల్తో పాటుగా కోలీవుడ్ అవకాశాలు కూడా శ్రీలీల చెంతకు చేరబోతున్నాయనే టాక్ నడుస్తుంది. దానితో శ్రీలీల మీరు సక్సెస్ అయ్యేందుకు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండడానికి కారణమేమిటి అని అడిగితే.. 

ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ పెద్ద పెద్ద ప్లానింగ్ చేసుకుంటూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ ని ప్లాన్‌ చేసుకోవాలి అనేది నాకు తలకు మించిన భారం. అందుకే నేను అలాంటివేం ఆలోచించకుండా నా పనిని చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తాను. ఇప్పటికిప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బావుంటుంది అనేది ఆలోచిస్తాను. 

ఫ్యూచర్ గురించి ఆలోచన చెయ్యను. అందుకే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదలకుండా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటాను. సినిమాల పట్ల నాకు ఉన్న ఇష్టం, అభిరుచి, అలాగే నా డాన్స్‌ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయంటూ శ్రీలీల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

 





Source link

Related posts

రేపే 'ఫ్యామిలీ స్టార్' టీజర్.. విజయ్ మళ్ళీ రచ్చ చేస్తాడా?

Oknews

petrol diesel price today 12 February 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 12 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

Karimnagar Drought | Karimnagar Drought: అధికార పార్టీ నేతల ఊళ్లకు నీళ్లిచ్చి.. మిగతా రైతుల పంటలు ఎండగడుతున్నారు

Oknews

Leave a Comment