ByGanesh
Sun 16th Jun 2024 11:59 AM
నిన్నమొన్నటి వరకు సైలెంట్ గా తన పని చేసుకుంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించిన శ్రీలీల తన పుట్టిన రోజునాడు పలు అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో క్రేజీగా కనిపించింది. ఆమె నటిస్తున్న సినిమాల నుంచి స్పెషల్ బర్త్ డే విషెస్ అందుకుంది. ముఖ్యంగా అవకాశాలు లేవు, రావడం లేదు అని అనుకునేవారికి శ్రీలీల కామ్ గా చెక్ పెటింది.
ఒక్కసారిగా టాలీవుడ్ లో బిజీ అవతారమెత్తింది. రవితేజ తో కలిసి ఓ మూవీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీలీల కి నితిన్ రాబిన్ హుడ్ నుంచి స్పెషల్ బర్త్ డే లుక్ అందింది. ఆ తర్వాత సాయంత్రనికి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి హరీష్ శంకర్ పవన్ తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్ వదిలారు.
ఇక సోషల్ మీడియాలో ఈమధ్యన స్పెషల్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల తాజాగా ఆరెంజ్ కలర్ శారీ లుక్ వదిలింది. హైట్ కి హైట్ అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ అన్ని ఆ చీర లో హైలెట్ అయ్యాయి. శ్రీలీల ని ఆరెంజ్ కలర్ శారీ లో చూసిన వారంతా ఆరెంజ్ శారీ లో అదరగొట్టిన శ్రీలీల అంటూ కామెంట్ చేస్తున్నారు.
Sreeleela in orange color saree:
Sreeleela looks stylish in an orange ruffle saree!