ByGanesh
Wed 03rd Apr 2024 08:07 PM
ఉగాదికి రాజమౌళి-మహేష్ బాబు కాంబో మూవీపై అసలు సిసలైన అప్ డేట్ వస్తుంది.. ఆ రోజున రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే చిత్రంపై క్లారిటీ ఇస్తారని మహేష్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది అంటూ మహేష్ తో చెయ్యబోయే చిత్రం పై ఊరించి వదిలారు. అటు మహేష్ బాబు తన ఫ్యామిలీతో స్విజ్జర్లాండ్ లో ఉన్నారు. అక్కడ వేసవి సెలవల ని ఎంజాయ్ చేస్తున్నారు.
మహేష్ ఇంకా తిరిగి హైదరాబాద్ కి రాలేదు. ఇటు చూస్తే ఉగాది వచ్చేస్తుంది. ఏప్రిల్ 9 న ఉగాది. ఉగాది కి పట్టుమని వారం కూడా లేదు. రాజమౌళి కాంపౌండ్ నుంచి SSMB 29 పై ఎలాంటి కబురు బయటికి రావడమే లేదు. దానితో మహేష్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. రాజమౌళి-మహేష్ చిత్రం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అంటున్నారు. మరి ఈ మూవీ ఓపెనింగ్ పై ఉగాదికి అప్ డేట్ ఇస్తే అది నేషనల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి.
కానీ సోషల్ మీడియాలో మహేష్-రాజమౌళి కాంబోపై న్యూస్ లు కనిపించడం లేదు. దానితో అసలు ఉగాదికి మహేష్ సినిమాపై రాజమౌళి నిజంగా అప్ డేట్ ఇస్తారా.. లేదంటే ఇదంతా రూమరా అనేది తెలియడం లేదు.
SSMB 29 news:
SSMB 29 update