Latest NewsTelangana

Strict Action Against those who Misbehave with Women at parks in Hyderabad She Team Warning | Hyd Police: హైదరాబాద్‌లోని పార్క్‌లపై షీటీంల నిఘా


Hyderbad Police: పార్కుల్లో కాస్త చాటు ప్రాంతం కనిపిందంటే పోకిరీలు చెలరేగిపోతున్నారు. చెట్టు, పుట్ట, గట్టు సహా సాధారణ ప్రజలు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన బెంచీలను సైతం వదిలిపెట్టడం లేదు. పట్టపగలు బహిరంగ ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తిస్తూ..అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad)లోని ఇందిరాపార్కు, పబ్లిక్ గార్డెన్, దుర్గం చెరువు వంటి ప్రాంతాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంది. ఇప్పుడు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ  వీరి ఆగడాలు శృతిమించుతున్నాయి. ఇలాంటి వారి పట్ల హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలపై నిఘ కొనసాగుతుంది. వారి అసభ్య ప్రవర్తనను రికార్డు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. 

పోకిరీలపై నిఘా
హైదరబాద్ లో పోకిరీల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఆడపిల్లలు,మహిళలు ఒంటరిగా కనిపిస్తే వేధించడం, వెంటపడి ఏడిపించడం ఎక్కువయ్యాయి. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసుు(Police)ల…రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను ఓ కంట కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులను చూస్తే వారు ఒక్కసారిగా పారిపోయే ప్రమాదముందని గ్రహించిన వారు..చాటుగా వారు చేసే అసభ్య ప్రవర్తనను రికార్డు చేయిస్తున్నారు. ఆ తర్వాత వివరాలు కనుక్కుని అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేసిన వారు తప్పిచుకోకుండా వీడియో సాక్ష్యం ఉంటుందని హైదరాబాద్ మహిళా సేఫ్టీ డీసీపీ(DCP) కవిత తెలిపారు. ఇప్పటికే ఇలాంటి వారిని 12 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించామన్నారు. కోర్టు ఆధారాలన్నీ పరిశీలించి వారికి జరిమానా విధించిందన్నారు.  షీ టీమ్‌(She Team) నిరంతరం మహిళా రక్షణ కోసం పని చేస్తుందని, ఇబ్బందులుంటే వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని ఆమె సూచించారు. 

పెరుగుతున్న ఫిర్యాదులు

మహిళలను వేధిస్తున్న ఫిర్యాదులు ఇటీవల కాలంలో భాగా పెరిగిపోతున్నాయని డీసీపీ కవిత తెలిపారు. యువతులను కాదు మహిళలను సైతం పోకిరీలు వేధిస్తున్నారని ఆమె వివరించారు. ముఖ్యంగా లేడిస్ హాస్టళ్లు, కళాశాలకు వెళ్లి వచ్చే దారులు, శివారు బస్టాండ్లల్లో వేధింపులు ఎక్కువయ్యయాన్నారు.అందుకే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని వివరించారు. పని ప్రదేశాల్లోనూ తోటి ఉద్యోగుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కొందరు మహిళలు పరువు పోతుందని..ఆ తర్వాత వేధింపులు మరింత ఎక్కువ అవుతాయని భావించి బయటకు చెప్పుకోలేకపోతున్నారని…అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె హామీ ఇచ్చారు. అటు యువకుల తల్లీదండ్రులను సైతం పోలీసులు హెచ్చరించారు.తమ బిడ్డల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటే వారి బంగారు భవిష్యత్ నాశనమవుతుందని తెలిపారు. ఇంటి నుంచే పిల్లల్లో మార్పు రావాలన్నారు. అలాగే మైనర్లు ఇష్టానుసారం బైకులపై చక్కర్లు కొడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని..అలాంటి వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తామని హైదరాబాదా పోలీసులు హెచ్చరించారు. పోకిరీలు ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని డీసీపీ కవిత హెచ్చరించారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Telangana Govt To Setup Electric Vehicle Charging Stations Across State

Oknews

పవన్ ‘ఓజీ’తో అప్పటి హీరో రీఎంట్రీ.. గుర్తున్నాడా?

Oknews

Minister Seethakka Warning: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో అటవీశాఖ అధికారులపై మంత్రి సీతక్క ఆగ్రహం

Oknews

Leave a Comment