ByGanesh
Thu 25th Jan 2024 09:37 AM
పవన్ కళ్యాణ్ మరో మూడు నెలల వరకు సినిమా షూటింగ్స్ వైపు చూసేలా లేరు. ఏపీలో ఎన్నికలు ముగిసేవరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఎన్నికల మూడ్ లో ఉన్న పవన్ ఇప్పుడప్పుడే సెట్స్ మీదకి రారు అని ఆయనతో సినిమా చేస్తున్న హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ మొదలు పెట్టేసాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రస్తుతం పక్కనపెట్టిన హరీష్ శంకర్ రవితేజ మిస్టర్ బచ్చన్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మరి హరీష్ త్వరగా డెసిషన్ తీసేసుకున్నాడు.
కానీ పవన్ కళ్యణ్ తో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న సుజిత్ మాత్రం సైలెంట్ గా కనబడుతున్నాడు. సాహో తర్వాత సుజిత్ పవన్ కళ్యాణ్ ని ఒప్పించి OG అంటూ భారీ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ముంబై మాఫియా బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న OG చిత్రం షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ వలన వాయిదా పడింది. అయితే హరీష్ లా సుజిత్ మరో సినిమా ఏది మొదలుపెట్టలేదు అంటే పవన్ కళ్యాణ్ వచ్చేవరకు సుజిత్ కి ఎదురు చూపులు తప్ప మరేదీ కనిపించడం లేదు.
మరోపక్క పవన్ కళ్యాణ్ క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లుని ఆల్మోస్ట్ ఆపేశారనే టాక్ ఉంది. మరి మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి రిలాక్స్ అయ్యేవరకు ఈ దర్శకులకి ఎదురు చూపులు తప్పేలా లేవు.
Sujith has to wait for Pawan:
Harish Shankar Mr Bachchan Regular Shoot update