ByGanesh
Sat 29th Jun 2024 11:39 AM
జూన్ 27 న విడుదలైన కల్కి చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ కల్కి 2898 AD అద్భుతమంటూ పొగిడేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వాని మెచ్చుకుంటున్నారు. అమితాబచ్చన్ కేరెక్టర్ ని ఆరాదించేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి చిన్న స్టార్ వరకు కల్కి చిత్రం ఓ విజువల్ వండర్ అంటూ నటుల దగ్గర నుంచి టెక్నీకల్ టీమ్ వరకు అందరిని పోగుడుతున్నారు.
నిన్న కమల్ హాసన్ కల్కి ని వీక్షించారు. నేడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కల్కి 2898 AD చిత్రాన్ని చూసి ఆయన స్పందనని సోషల్ మీడియా ద్వారా తెలియజెయ్యడమే కాదు.. కల్కి పార్ట్ 2 కోసం వెయిటింగ్ అంటూ మాట్లాడడం మేకర్స్ ని సర్ ప్రైజ్ చేసింది. Watched Kalki. WOW! What an epic movie! Director @nagashwin7 has taken Indian Cinema to a different level. Hearty congratulations to my dear friend @AswiniDutt @SrBachchan @PrabhasRaju @ikamalhaasan @deepikapadukone and the team of #Kalki2898AD. Eagerly awaiting Part2. God Bless అంటూ ట్వీట్ చేసారు.
కల్కి చూసాను. వావ్ అనకుండా ఉండలేకపోతున్నాను. నాగ్ అశ్విన్ పురాణాలను ఎంత చక్కగా తెరకెక్కించాడు. ఇండియన్ సినిమాని కల్కి వేరే లెవల్ కి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో భాగమైన నా ప్రియమిత్రుడు కమల్ కి నా అభినందనలు. ఈ చిత్రంలో నటించిన అమితాబ్, ప్రభాస్, దీపికా, నిర్మాత అశ్విని దత్ అందరికి గాడ్ బ్లెస్స్ యు.. కల్కి పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నా అంటూ రజిని కల్కి చూసి తన రివ్యూ అందించారు.
Superstar waiting for Kalki 2:
Superstar Rajinikanth waiting for Kalki 2