2023 వరల్డ్ కప్ ఫైనల్ భారత క్రికెట్ అభిమానుల మనస్సులో ఒక చెరిగిపోని గాయం. సొంత గడ్డపై లక్ష మంది భారతీయుల ముందు ఆస్ట్రేలియా చెప్పి మరీ టీమిండియాను ఓడించింది. ఆ వెంటనే ఇండియాలోనే జరిగిన టీ20 సిరీస్‌లో భారత్… ఆస్ట్రేలియాను 4-1తో చిత్తుగా ఓడించింది. కానీ టీమిండియా ఫ్యాన్స్‌కు కిక్కు సరిపోలేదు. ఇప్పుడు ఫ్యాన్స్‌కు సూపర్ కిక్కిచ్చే ఛాన్స్ టీమిండియాకు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ – 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా టోర్నమెంట్‌లో నిలవాలంటే భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతే వారి సెమీస్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ టీమిండియాకు వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఆస్ట్రేలియా ఇంటి ముఖం పడితే మాత్రం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.
ఆట వీడియోలు
Aus vs Ind Super 8 Match Rain | ఆసీస్ మ్యాచ్ లో వాన పడితే సెమీస్ కు వెళ్లేది ఎవరు.? | ABP Desam
మరిన్ని చూడండి