ఒక్క మనిషి కోసం సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అల్లు అర్జున్ పక్కన ఉన్న వారు సరైన సలహా ఇవ్వకపోవడం కూడా సంధ్య థియేటర్ తొక్కిసలాటకు ఓ కారణం అన్నారు.
ఎలాంటి ప్రచారం లేకుండా సినిమాకు వెళ్తే ఇలా జరిగి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు హీరోలు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన సమస్యగా మారిందన్నారు. కలెక్షన్లతో కాకుండా తమ నటనతో గర్వకారణంగా ఉండాలని సూచించారు.
Topics: