GossipsLatest News

Tarakaratna death anniversary: Alekhya emotional post అప్పుడే ఏడాదైపోయింది: తారకరత్న భార్య



Sun 18th Feb 2024 08:15 PM

taraka ratna  అప్పుడే ఏడాదైపోయింది: తారకరత్న భార్య


Tarakaratna death anniversary: Alekhya emotional post అప్పుడే ఏడాదైపోయింది: తారకరత్న భార్య

నందమూరి తారకరత్న ప్రాణాలతో పోరాడి తుది శ్వాస విడిచి నేటికి ఏడాది పూర్తయ్యింది. కుటుంభ సబ్యులని ముఖ్యంగా భార్య పిల్లలని వదిలి తారకరత్న తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. నటుడిగా బిగ్ బ్రేక్ తీసుకున్న తారకరత్న అలేఖ్య తో పెళ్లితో నందమూరి కుటుంబానికి దూరమయ్యాడు. మళ్ళీ నటనకు రీ ఎంట్రీ, ఫ్యామిలీ అక్కున చేర్చుకోవడంతో తారకరత్న పొలిటికల్ ఎంట్రీకి దారులు వెతుక్కుంటూ బావ నారా లోకేష్ యువగళం పాదయత్రకి హాజరైన వెంటనే గుండెపోటు తో బెంగుళూరు ఆసుపత్రిలో చేరి కొన్నాళ్లపాటు ప్రాణాలతో పోరాడాడు.

కానీ మరణాన్ని జయించడంలో తారకరత్న ఓడిపోయాడు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య మూగబోయింది, కన్నీరుమున్నీరైంది. పిల్లలు అనాథలయ్యారు. నందమూరి ఫ్యామిలీ అండతో అలేఖ్య మెల్లగా కోలుకునేలోపు తారకరత్న మరణించి ఏడాది పూర్తయ్యింది. దానితో అలేఖ్య మరోసారి కన్నీటి పర్యంతమైంది. భర్త మరణంతో ఒంటరిదైన అలేఖ్య తరచూ భర్త జ్ఞాపకాల్లో మునిగిపోయింది. ఇక ఇప్పుడు తారకరత్నని తలుచుకుంటూ అలేఖ్య సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యేకొద్దీ నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిది. 18-02-23 నుంచి నీకు నాకు ఎలాంటి హద్దులు లేవు, రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మీ ప్రేమ, మీ ఉనికి మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికి మరువలేము, నేను నిన్ను తాకలేను, కానీ నీ ఉనికి ఎప్పటికి మా చుట్టూనే ఉంటుంది. నువ్వే మా బలం, నువ్వు ఎన్నటికీ మాతోనే ఉంటావు అంటూ అలేఖ్య తారకరత్నని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యింది.


Tarakaratna death anniversary: Alekhya emotional post:

Taraka Ratna wife Alekhya Gets Emotional On His First Death Anniversary









Source link

Related posts

brs working president ktr slams cm revanth reddy | KTR: ‘ఎన్నికల ముందు చెప్పిందొకటి ఇప్పుడు చేసేదొకటి’

Oknews

Nidhi Agarwal joins Raja Saab sets పవన్ వదిలేసినా.. ప్రభాస్ ఆదుకున్నాడు

Oknews

Janhvi Kapoor looks stunning in her latest look దేవకన్యలా దేవర భామ

Oknews

Leave a Comment