ByGanesh
Wed 25th Oct 2023 09:43 PM
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అయితే పోటీ చేస్తున్నాయి ఇది ఫిక్స్. ఇక కొన్ని పార్టీల విషయంలోనే సరైన క్లారిటీ రావడం లేదు. వాటిలో ఒకటి తెలుగుదేశం పార్టీ. అయితే నిన్న మొన్నటి వరకూ టీడీపీ పోటీ చేస్తుందా? లేదా? అనే చిన్న కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఈ విషయంపై పార్టీలోని నేతల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అయినా ఏమైనా చెబుతారా? అంటే తమ పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన మీదట నిర్ణయం ప్రకటిస్తామని కూల్‌గా చెప్పారు. అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు.
తెలంగాణలో తమ పార్టీ పోటీ చేయడం లేదని.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ స్పష్టం చేసింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణలో బీభత్సంగా హడావుడి జరిగింది. బైక్, కారు ర్యాలీల పేరుతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన నిర్వహించారు. చివరకు మెట్రో రైళ్లలో సైతం నల్ల చొక్కాలు ధరించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నిజానికి ఇదంతా చంద్రబాబుకు తెలంగాణలో ఉన్న క్రేజేనని చెప్పాలి. సెటిలర్స్ మద్దతు అంతా చంద్రబాబుకే ఉంది. మరి ఇలాంటి తరుణంలో పోటీ చేయబోమని నారా లోకేష్ చెప్పడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు టీడీపీ మద్దతు ఎవరికి ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఎక్కువ మంది అయితే కాంగ్రెస్ పార్టీకే టీడీపీ సపోర్ట్ ఉంటుందంటున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నా కూడా ఒకప్పుడు చంద్రబాబు నీడన పెరిగిన వాడే కావడంతో టీడీపీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని జనం చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తొలుత ర్యాలీలు, ఆందోళనలు చేయనివ్వబోమంటూ టీడీపీని నిలువరించేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఆ తరువాత నారా లోకేష్‌పై ఎక్కడ లేని సానుభూతి చూపించారు. ఇదంతా సెటిలర్స్ ఓట్ల కోసమేనని టాక్ కూడా నడిచింది. ఇక ఈ పార్టీలను పక్కనబెడితే ఏపీలో టీడీపీతో కలిసి వెళుతున్న జనసేన తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి ఆయా స్థానాల్ో అయితే టీడీపీ సపోర్ట్ పక్కాగా జనసేనకే ఉంటుందంటున్నారు.
TDP will not contest ok.. who will support?:
TDP Left The Election Ring in Telangana