Telangana

telangana acb officers raids and arrested three officials | Acb Raids: రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు



Three Officials Arrested By Telangana Acb: తెలంగాణలో (Telangana) పలువురు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వేర్వేరు చోట్ల ముగ్గురు అధికారులను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హుజూరాబాద్ (Huzurabad) ఆర్టీసీ డిపో మేనేజర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించలేదని ఛార్జిమెమో అందించారు. అయితే, శాఖాపరమైన కేసు కొట్టేసేందుకు డిపో మేనేజర్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ.10 వేలు అందించగా.. ఎల్కతుర్తి హోటల్ లో మరో రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఫార్మసీ అనుమతి కోసం లంచం డిమాండ్
అటు, నల్గొండ (Nalgonda) డ్రగ్ ఇన్ స్పెక్టర్ సోమశేఖర్ కూడా ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్రణాళికతో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఆసిఫాబాద్  లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Hyderabad News: తీసుకున్న అప్పు చెల్లించలేదని దారుణం – నడిరోడ్డుపై రూ.కోట్ల కారును తగలబెట్టేశారు, ఎక్కడంటే?

మరిన్ని చూడండి



Source link

Related posts

TS Assembly Election :ఇలా చేస్తే నామినేషన్ రిజెక్ట్, అక్టోబర్ 31 వరకు ఓటు హక్కు దరఖాస్తు -సీఈవో వికాస్ రాజ్ కీలక సూచనలు

Oknews

V Prakash About KCR | V Prakash About KCR | ఆ విషయంలో కేసీఆర్, కేటీఆర్ కు మధ్య గొడవ..!

Oknews

Telangana Election 2023 CPI Leader Narayana Satirical Tweet On Congress

Oknews

Leave a Comment