తెలంగాణ ఉద్యమంలో పాల్గొని…. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తాటికొండ రాజయ్యకు మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని దుయ్యబట్టారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆ పదవిని తీసుకున్న వ్యక్తి కడియం శ్రీహరి అని చెప్పారు. రాజయ్య సిట్టింగ్ సీటును కూడా కొట్టేశారని అన్నారు. ఇందుకు కౌంటర్ గా కడియం శ్రీహరి మాట్లాడారు. అసలు కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో మోసం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇరువురి మధ్య వాదన సాగుతుండగా… మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకున్నారు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని సూచించారు.
Source link
previous post