Latest NewsTelangana

Telangana Elections: తెలంగాణలో ఇదో డిఫరెంట్ సీటు – ద్విముఖ పోటీలో ఈసారి నెగ్గేదెవరో!

అదో విలక్షణమైన నియోజకవర్గం.. గ్రామీణ ప్రాంతం, గ్రేటర్ వరంగల్ సిటీ ప్రజలు కలిసి ఉన్న నియోజకవర్గం. అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరూరి రమేష్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండుసార్లు విజయం సాధించిన ఆరూరి రమేష్.. మూడవ సారి తన అదృష్టాన్ని ఓటర్ల చేతులో పెట్టారు.

ఇక నియోజకవర్గ పరిస్థితులను చూస్తే 1952లో తొలిసారిగా జనరల్ స్థానంగా వర్థన్నపేట నియోజవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఇప్పటికి 15 సార్లు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్  3 సార్లు, ఇండిపెండెంట్లు 3 సార్లు, తెలుగుదేశం 3 సార్లు, బీజేపీ, బీఆర్ఎస్ 2 సార్లు, జనతా పార్టీ ఒక్కసారి విజయం సాధించాయి.

జనరల్ స్థానంగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీ రిజర్వుడ్ గా మారింది. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటి నుంచి ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,55,508 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1,27,087 పురుషులు ఉన్నారు. 1,28,421 మహిళా ఓటర్లు ఉన్నారు. పునర్విభజన తరువాత మొదటి సారిగా కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. ఇక 2014, 2018 లో బీఆర్ ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2023 ఎన్నికల్లో సైతం అరూరి రమేష్ మూడవ సారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

రెండూ కలిసిన నియోజకవర్గం
ఈ నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ కాదు.. పూర్తిగా సిటీ కాదు. రెండు కలిసి ఉన్న నియోజకవర్గం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 13 డివిజన్లను కలుపుకొని ఈ నియోజకవర్గ రూపొందింది. అంతే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల్లో రెండో అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ ప్రధానంగా ద్విముఖ పోటీ ఉంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ బరిలో నిలవగా. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

అయితే, అరూరి రమేష్ 2014, 2018 ఎన్నికల్లో 90 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మెజారిటీగా రికార్డులో నిలిచారు. రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆరూరి రమేష్ పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఎక్కువసార్లు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి.  ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతే ప్రతిపక్షాలకు కలిసిరానున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోనుంది.

సమస్యలు
నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అంతంతమాత్రమే.
నియోజకవర్గంలో గిరిజన తండాలు ఎక్కువ. తండాలకు రోడ్డు మార్గాలు లేవు.
వర్షాకాలంలో మానేరు వాగుపై ప్రవాహానికి రాకపోకలు బంద్. ఏండ్ల తరబడి సమస్యల పరిష్కారం లేదు.
అనర్హులకు దళితబంధు
ప్రతి ఆవాసానికి మురికి నీరు శుద్ధీకరణ యూనిట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన అటకెక్కింది.
వర్థన్నపేట నియోజకవర్గం పరిధిలో 731 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి.
కార్పొరేషన్ విలీనగ్రామాలు సమస్యలకు నిలయం. అటు గ్రామం కాదు.. ఇటు సిటీ కాదు
విలీన గ్రామాలను వెంటాడుతున్న పారిశుద్ధ్య సమస్యలు
ఇటు కార్పొరేషన్ నిధులకు దూరం, అటు ఎమ్మెల్యే నిధులకు దూరం

Source link

Related posts

Group posts should be increased in Telangana Unemployed and coaching centers demand | గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంచండి, బిచ్చం వేయకండి

Oknews

పవన్ కళ్యాణ్ ఉయ్యాల పిక్ వైరల్

Oknews

మస్క్ ట్వీట్.. జగన్‌కు పెరిగిన అనుమానం!

Oknews

Leave a Comment