Telangana Government Key Decision on Sand Mining: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు కలెక్టర్లకు పరిశ్రమలు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ ప్రాంతాల్లోని ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించకుండా.. అందుబాటులో ఉంచాలని గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమీప వాగుల నుంచి ఇసుకను ఉచితంగా రవాణా చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరం ఉన్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అధికారులు అనుమతిస్తారు.
‘నిబంధనలు పాటించాలి’
ఇసుక రవాణాలో నిబంధనలు పాటించాలని గనుల శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్ర ఇసుక మైనింగ్ నిబంధనలు – 2015 కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు, స్థానికంగా నిర్మాణాలకు అందుబాటులో ఉంచడం, రవాణా, ఇళ్ల నిర్మాణ పథకాలకు ఉచిత ఇసుక సరఫరా వంటి నిబంధనలు పాటించాలన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: CM Revanth Reddy: ‘నేను చేరలేని దూరం కాదు, దొరకనంత దుర్గం కాదు’ – సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
మరిన్ని చూడండి