Telangana Politics single MLA for BRS in Warangal Distrcit: బండ్లు ఓడలు… ఓడలు బండ్లు అవుతాయి అనడానికి వరంగల్ జిల్లా రాజకీయాలే నిదర్శనం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవగా. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపెంచారు. కానీ గతంలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే మిగలగా.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉండి రాజకీయ చరిత్రలో నిలిచారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో రెండు సీట్లురాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా పేరున ఉమ్మడి వరంగల్లో 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్యేలు తెలుసుకోగా బీఆర్ఎస్ పార్టీ 10 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు ఎమ్మెల్యేగా సీతక్క గెలుపొందారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడంతో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చి గులాబీ కండువా కప్పుకొని కారెక్కారు. ఇక మరో ఎమ్మెల్యే సీతక్క పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అందులోనే కొనసాగారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు.బీఆర్ఎస్ కు ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే..2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగడంతో 2018 ఎన్నికల రికార్డును తిరగరాసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన్ సైడ్ గా 10 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుం కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ రెండు ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందింది. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నుండి గెలవగా, జనగామ నియోజకవర్గం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం గుటికి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఏకైక ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత చరిత్ర రిపీట్ అయింది.
ఎమ్మెల్యేలు గెలిచిన ఆ పార్టీ అధికారంలో లేకపోవడంతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ మారే ముందు నేతలు చెబుతున్నారని తెలిసిందే. త్వరలో లోక్‌సభ ఎన్నికలు కావడంతో సీటు దక్కని ప్రజాప్రతినిధులు, నేతలు పక్క చూపులు చూస్తున్నారు. వేరే పార్టీలో ఉదయం చేరి రాత్రి టికెట్లు పొందిన నేతలు ఉన్నారు. నిన్న పార్టీ కండువా మార్చుకుని, 24 గంటల్లోపే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు సాధించుకున్నా వారు సైతం ఉన్నారు. పార్టీలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని సైతం విమర్శలు వచ్చినా వారు పట్టించుకోవడం లేదు.
మరిన్ని చూడండి
Source link