TS SSC Exams Halltickets: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టిక్కెట్లు మార్చి 7న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పదోతరగతి రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేట్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ విద్యార్థుల హాల్‌టికెట్లను కూడా విడుదల చేశారు. తమతమ పాఠశాలల లాగిన్ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం షెడ్యూలు ప్రకారం.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు (TS SSC Exams) నిర్వహించనున్నారు.
ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానుండగా.. మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి.
పదోతరగతి హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ పదోతరగతి హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి – https://bse.telangana.gov.in/
➥ అక్కడ హోంపేజీలో హాల్‌టికెట్లకు సంబంధించి ‘SSC Public Examinations March 2024 Hall Tickets’ లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ తర్వాత వచ్చే పేజీలో పదోతరగతి రెగ్యులర్, ప్రైవేట్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ విద్యార్థుల హాల్‌టికెట్లకు సంబందించిన లింక్స్ కనిపిస్తాయి.
➥ అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి, Submit బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ తర్వాతి పేజీలో పదోతరగతి హాల్‌టికెట్‌ను కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.
పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
షెడ్యూలు ప్రకారం మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష తేదీ | పేపరు |
మార్చి 18 | ఫస్ట్ లాంగ్వేజ్ |
మార్చి 19 | సెకండ్ లాంగ్వేజ్ |
మార్చి 21 | థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) |
మార్చి 23 | మ్యాథమెటిక్స్ |
మార్చి 26 | ఫిజికల్ సైన్స్ |
మార్చి 28 | బయాలజికల్ సైన్స్ |
మార్చి 30 | సోషల్ స్టడీస్ |
ఏప్రిల్ 1 | ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు |
ఏప్రిల్ 2 | ఓరియంటెల్ పేపర్-2 |
ALSO READ:
ఏపీ పదోతరగతి హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టిక్కెట్లు మార్చి 4న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమతమ పాఠశాలల లాగిన్ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఏపీలో పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని చూడండి