Tenth Students Addicted to Drugs in Jagitial: జగిత్యాల (Jagitial) జిల్లాలో గంజాయి కలకలం రేపుతోంది. టెన్త్ విద్యార్థినులు మత్తుకు బానిస కావడం అందరినీ షాక్ కు గురి చేసింది. గంజాయికి బానిసైన విద్యార్థినులు రోజూ సేవిస్తూ మత్తులో జోగుతున్నారు. బాలికలు వింతగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చిన ఓ బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికలను శిశు సంరక్షణ కమిటీకి తరలించగా.. అక్కడ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బాలికలకు గంజాయి సప్లై వెనుక సెక్స్ రాకెట్ ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయితో పాటు హైదరాబాద్ లో రేవ్ పార్టీలకు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రతి పార్టీకి ఈ ముఠా రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
దాదాపు 10 మంది బాలికలు గంజాయికి బానిసైనట్లు సమాచారం. ఈ ఘటనపై నార్కోటిక్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. బాలికలను మత్తుకు బానిస చేస్తున్న వారి వెనుక అసలు సూత్రదారులెవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. సెక్స్ రాకెట్ ముఠాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మత్తుకు బానిసైన బాలికలను శిశు సంరక్షణ హోంకు తరలించారు.
Also Read: పోలీస్ అధికారిపై పోక్సో కేసు – మహిళ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టిన పోలీసులు, భూపాలపల్లి జిల్లాలో ఘటన
మరిన్ని చూడండి
Source link