Telangana

TGRDC CET 2024 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్… రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్



ముఖ్య వివరాలు :ప్రకటన – TGRDC CET 2024ప్రవేశాలు – డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కల్పిస్తారు. (మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బాలుర/బాలికల సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ఈ అడ్మిషన్లు ఉంటాయి)అర్హులు – ఇంటర్ పూర్తి చేసినవారు. ప్రస్తుతం పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తులు – ఆన్ లైన్ విధానంలోనేదరఖాస్తు ఫీజు – రూ. 200 చెల్లించాలి.దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్‌ 12, 2024.హాల్ టికెట్ల జారీ – ఏప్రిల్ 21, 2024.రాత పరీక్ష – ఏప్రిల్ 28, 2024.సీట్ల కేటాయింపు – రాత పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీటును కేటాయిస్తారు.అధికారిక వెబ్ సైట్ – https://tsrdccet.cgg.gov.in/అప్లికేషన్ లింక్ – https://tsrdccet.cgg.gov.in/MJRDCSPRNEWAPPL/#!/tsmjbcrdcappl13022024.appl తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే…?Telangana Inter Results 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే.. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యాయి. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉండగా… 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.ఇంటర్ పరీక్షలు పూర్తి కావటంతో వెంటనే స్పాట్ ను నిర్వహిస్తోంది ఇంటర్మీడియట్ బోర్డు. మొత్తం 4 విడతల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే మూడు విడుతలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగో విడుత కొనసాగుతోంది.ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. మొత్తం 60 లక్షల పేపర్లు మూల్యాంకనం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా 20 వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో ఉన్నారు.వాల్యూయేషన్ పూర్తి అయిన తర్వాత… దాదాపు పది రకాలుగా పరిశీలించిన తర్వాతే…ఆన్ లైన్ లో మార్కులను నమోదు చేసేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఆన్ లైన్ లో మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతికపరమైన అంశాలన్నీ కూడా ఏప్రిల్ రెండో వారంలోపు పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ మూడో వారం చివర లేదా నాల్గో వారంలో ఫలితాలను(Telangana Inter Result) ప్రకటించే ఛాన్స్ ఉంది.



Source link

Related posts

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు దానం నాగేందర్, రంజిత్ రెడ్డి

Oknews

Siddipet Crime : సిద్దిపేట జిల్లాలో దారుణం, మంత్రాలు వేశాడనే నెపంతో వ్యక్తి హత్య

Oknews

TS Indiramma Housing Scheme : తొలి విడతలో వారికే 'ఇందిరమ్మ ఇండ్లు'..! 4 విడతలుగా సాయం, స్కీమ్ తాజా అప్డేట్స్ ఇవే

Oknews

Leave a Comment