GossipsLatest News

That effect on Kalki 2898 AD collections కల్కి 2898 AD కలక్షన్స్ పై ఆ ప్రభావం


భారీ అంచనాల నడుమ నాగ్ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్, వైజయంతి వారి కాస్ట్లీ ప్రాజెక్ట్ కల్కి 2898 AD చిత్రం నిన్న జులై 27 న విడుదలైంది. కల్కి విడుదలవడమే పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియా నిండిపోయింది. సినిమాని వీక్షించిన ప్రతి ఒక్కరూ కల్కి సూపర్బ్, కల్కి అదుర్స్, విజువల్ వండర్, నాగ్ అశ్విన్ మేకింగ్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం, కేవలం మూడు సినిమాల అనుభవం.. ఇలాంటి అవుట్ ఫుట్ అంటూ కల్కి ని పొగిడినవారే కానీ.. పొగడని వారు లేరు.. 

కట్ చేస్తే కల్కి ఓపెనింగ్స్ అనుకున్నంతగా రాకపోవడం ఇప్పుడు సినీ విశ్లేషకులని ఆశ్చర్య పరిచింది. అనుకున్న ఫిగర్ కి అటు ఇటుగా పది కోట్లు డ్రాపవుట్ అనేది అందరికి షాకిచ్చింది. కొంతమంది కల్కి కలెక్షన్స్ తగ్గడానికి వర్షాలు, క్రికెట్ మ్యాచ్ ల ప్రభావం పడింది అంటూ మాట్లాడుతున్నారు. 

కానీ కల్కి 2898 AD కి కలెక్షన్స్ తగ్గడానికి అసలు కారణం వేరే ఉంది.. వర్షాలు, క్రికెట్ మ్యాచ్ ఇవేమి కాదు.. అసలు కల్కి ఓపెనింగ్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోవడానికి కల్కి చిత్రానికి తగినంత ప్రమోషనల్ ఈవెంట్స్ లేకపోవడం, అధిక టికెట్ రేట్లు ప్రధాన కారణమంటున్నారు చాలామంది. కల్కి చిత్రం మొదటి నుంచి మల్టిప్లెక్స్ సినిమాగానే ఆనింది కానీ.. B,C సెంటర్స్ వారికి రీచ్ అవలేదు. ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు కల్కి మేకర్స్. హైదరాబాద్ బుజ్జి ఈవెంట్ సరిపోతుంది కల్కి పై హైప్ పెరగడానికి అనుకున్నారు. 

స్టార్స్ తో ఒక్క ఇంటర్వ్యూ లేదు, మీడియా తో ప్రెస్ మీట్ లేదు, కమల్ గడ్డ తమిళనాట కల్కి ప్రమోషన్స్ అస్సలే లేవు. పాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ ఎలా ఉండాలో సోషల్ మీడియా ప్రాచుర్యం పొందాక ఒకరు చెప్పక్కర్లేదు. నాగ్ అశ్విన్ కి మే 9 నుంచి జూన్ 27 కి సినిమా పోస్ట్ పోన్  చేసాక తగినంత సమయం ఉంది. కానీ సినిమా విడుదల వరకు ఆయన సినిమాని చెక్కుతూనే ఉన్నారు. ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేదు. మీడియా ముందుకు రారు అంటూ నాగ అశ్విన్ పై పలు విమర్శలు మొదలయ్యాయి. 

అంతేకాదు అనూహ్యంగా పెరిగిన కల్కి టికెట్ రేట్స్ కూడా ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడేలా చేసింది, నెలాఖరు రోజులు.. అందుకే కల్కి వైపు వెళ్ళడానికి ఆలోచించారంటున్నారు మిడిల్ క్లాస్ పీపుల్. 

ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ చిత్రం B, C సెంటర్స్ ని కదిలించలేకపోయింది. కల్కి ఓపెనింగ్స్ తగ్గడానికి ప్రమోషన్స్ మెయిన్ కారణం.. మిగతావన్నీ చిన్న చిన్న కారణాలే అంటూ పలువురు మాట్లాడం చూస్తే నిజమే అనిపించకమానదు. 





Source link

Related posts

రంగారెడ్డి జిల్లా కొందుర్గులో భారీ పేలుడు.!

Oknews

‘భారతీయుడు-2’ విడుదలపై మదురై కోర్టు కీలక తీర్పు!

Oknews

TS Police Transfer: తెలంగాణలో 110 మంది డీఎస్పీలు, 39 మంది అదనపు ఎస్పీల బదిలీ

Oknews

Leave a Comment