ByGanesh
Wed 24th Jan 2024 08:56 PM
బాలీవుడ్ కాంట్రావర్సీ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంది. ఎవరినో ఒకరిని విమర్శిస్తూ కయ్యానికి కాలు దువ్వుతుంది. అయితే తాజాగా కంగనా అయోధ్యలో హడావిడి చేసింది. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కంగనా అయోధ్య వెళ్లి అక్కడ చాలా హడావిడి చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు.. కంగనా ఎవరితోనో డేటింగ్ లో ఉంది అనే వార్త పుట్టుకొచ్చేలా చేసింది. హ్రితిక్ రోషన్ తో బ్రేకప్ తర్వాత ఒంటరిగా ఉంటున్న కంగనా పై మరో డేటింగ్ రూమర్ మొదలైంది.
అయోధ్యలో ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పుట్టి తో ఫొటోలకి కంగనా ఫోజులివ్వడంతో అందరూ కంగనా నిశాంత్ తో డేటింగ్ లో ఉంది అంటూ రూమర్ పుట్టించారు. అయితే అది చూసిన కంగనా తాను నిశాంత్ తో డేటింగ్ లో లేను, అతనికి ఆల్రెడీ పెళ్లయ్యింది, ఇలాంటి వార్తలను ఎవ్వరూ నమ్మొద్దు, అదంతా కేవలం వదంతులు మాత్రమే అంటూ కంగనా కొట్టిపారేసింది. అంతేకాదండోయ్.. తాను డేటింగ్ లో ఉన్న విషయాన్ని బయటపెట్టింది.
తాను వేరే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను అని, ఆ వ్యక్తి ఎవరో అనేది త్వరలోనే బయటపెడతాను అంటూ కంగనా తాను డేటింగ్ లో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. ఒక వ్యక్తితో ఫోటో దిగితే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చెయ్యడం కరెక్ట్ కాదు, ఎదుటి వారి పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అంటూ గాసిప్ రాయుళ్ళకి కంగనా క్లాస్ పీకింది.
The heroine says that she is dating:
Kangana Ranaut confirms she dating someone